Last Updated:
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ గల్లీ నుంచి ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హస్తినకు బయల్దేరగా.. మంత్రి కొండా సురేఖ సైతం ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక ఇప్పుడు బంతి హైకమాండ్ కోర్టులో ఉంది.
Telangana Congress Politics: తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ గల్లీ నుంచి ఇప్పుడు ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే హస్తినకు బయల్దేరగా.. మంత్రి కొండా సురేఖ సైతం ఢిల్లీలోనే మకాం వేశారు. ఇక ఇప్పుడు బంతి హైకమాండ్ కోర్టులో ఉంది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిపై విమర్శలు, ఆరోపణలు చేయడమే కాకుండా పార్టీ ప్రతిష్టను దిగజార్చారంటూ మంత్రి కొండాసురేఖ, తెలంగాణ ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిపై క్రమశిక్షణ కమిటీ ఓ నివేదికను తయారు చేసి టీపీసీసీ చీఫ్ ద్వారా హైకమాండ్‌కు చేరవేసింది. అయితే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? వారికి అప్పగించిన పదవులను తొలగిస్తే సరిపోతుందా లేక పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేస్తారా అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. ఈరోజు సాయంత్రం కాంగ్రెస్ కీలకనేత కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ భేటీ కానున్నారు. వారిద్దరి అభిప్రాయం తీసుకున్న తర్వాతే కొండా సురేఖ, చిన్నారెడ్డిపై చర్యలు తీసుకుంటారని తెలుస్తోంది. ఈరోజుతో కొండా సురేఖ, చిన్నారెడ్డి అంశం క్లైమాక్స్‌కి చేరుకుంటుంది.














