Tirumala | శ్రీవారి భక్తులకు భోజనం వడ్డించిన చంద్రబాబు ఫ్యామిలీ | ACTPnews

Tirumala | శ్రీవారి భక్తులకు భోజనం వడ్డించిన చంద్రబాబు ఫ్యామిలీ



ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా దేవాన్ష్ పుట్టినరోజున అన్నదానం చేయడం ఈ కుటుంబానికి ఆనవాయితీ. ఈ ఏడాది కూడా రూ. 44 లక్షలను టీటీడీ అన్నప్రసాద ట్రస్టుకు విరాళంగా అందజేసి, ఒకరోజు అన్నదాన వితరణ బాధ్యతను స్వీకరించారు. దర్శనం అనంతరం వెంగమాంబ అన్నప్రసాద కేంద్రానికి చేరుకున్న చంద్రబాబు, భువనేశ్వరి, లోకేష్ మరియు దేవాన్ష్ భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. ముఖ్యమంత్రి స్వయంగా వడ్డిస్తుండటంతో భక్తులు ఆశ్చర్యానికి, ఆనందానికి లోనయ్యారు. ఈ సందర్భంగా దేవాన్ష్‌ను అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *