తెలుగు వాళ్లకు సినిమా అంటే ఒక ఎంటర్‌టైనమెంట్ మాత్రమే కాదు ఒక ఎమోషన్ కూడా. నచ్చితే సినిమాను నెత్తిన పెట్టుకుని ఊరేగుతారు. అదే నచ్చకపోతే పాతాళానికి తొక్కేస్తారు. అందుకే భాషతో సంబంధంలేకుండా ఏ సినిమాలు వచ్చినా కంటెంట్ కొత్తగా ఉంటే మనవాళ్లు ఆదరించినట్లు ఏ ఇండస్ట్రీ సినీ లవర్స్ కూడా ఆధరించరు. అంత గొప్ప సినిమా ఫ్యాన్స్ మనవాళ్లు. ఈ విషయాన్ని చాలా మంది సినీ స్టార్లే బహిరంగంగా ఒప్పుకున్నారు. మనవాళ్లకు తెలుగు, తమిళ, మలయళం, హిందీ, కన్నడ ఇలా భాషా బేధాలు ఉండవు. కంటెంట్ నచ్చితే ఏ భాష సినిమాను అయినా హిట్ చేసేస్తుంటారు. నచ్చకపోతే తెలుగు సినిమా అయినా సరే పక్కకు నూకేస్తారు.













