Top 10 News Today: నేటి టాప్ 10 వార్తలు మీకోసం.. సుత్తి లేకుండా రెండు నిమిషాల్లో చదివేయండి | తెలంగాణ వార్తలు | ACTPnews

Today Top 10 News: నేడు దేశంలో జరిగిన టాప్-10 కీలక పరిణామాలు ఇవే | తెలంగాణ వార్తలు


ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో శంకుస్థాపన చేశారు.దేశంలోనే తొలిసారిగా 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణానికి బుర్రిపాలెంను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు.ఈ ప్రాజెక్టు కింద బుర్రిపాలెం, ఓబులనాయుడు పాలెంలో రూ.14 కోట్లతో 117 ఇళ్లను నిర్మించనుండగా, కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలు మరియు సీఎస్‌ఐఆర్-సీబీఆర్‌ఐ సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.

2.ఎల్‌నినో కాదు.. కరెంటు కోతలకు కాంగ్రెస్‌సే కారణం

హరీశ్‌రావు మెదక్‌ జిల్లా కాగజ్‌మద్దూర్‌లో పర్యటించి రైతుల సమస్యలను పరిశీలించారు. రాష్ట్రంలో కరెంటు కోతలకు ఎల్‌నినో కారణం కాదని, కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. రైతులు పొలాల్లో పని చేయాల్సింది పోయి సబ్‌స్టేషన్ల వద్ద ధర్నాలు చేసే పరిస్థితిని కాంగ్రెస్‌ ప్రభుత్వం తెచ్చిందని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో రూ.4,500కే విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చామని, ఇప్పుడు డిపాజిట్‌ ఛార్జీలు రూ.10 వేలకు పెంచారని ఆరోపించారు. సింగరేణి థర్మల్‌ ప్లాంట్‌ నుంచి ఉత్పత్తయ్యే 800 మెగావాట్ల విద్యుత్‌ను రాజస్థాన్‌కు కాకుండా తెలంగాణ అవసరాలకు వినియోగించాలని కోరారు.

3.కరవు పరిస్థితి చూస్తుంటే బాధగా ఉంది..

రాష్ట్రంలో కరవు పరిస్థితి చూస్తుంటే చాలా బాధగా ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వరుణయాగం చేసి చేతులెత్తేశారని విమర్శించారు. వెంటనే కరవు మండలాలను ప్రకటిస్తేనే రైతులకు కేంద్రం నుంచి సాయం అందుతుందని చెప్పారు. కృష్ణ జలాలు కుప్పం వరకు తరలిపోతున్నా, మన పాలమూరుకు మాత్రం రావట్లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డి చంద్రబాబుకు నీళ్లను బహుమతిగా ఇస్తున్నారని ఆరోపించారు.విద్యుత్ కోతలు నిరూపించేందుకు కొండారెడ్డిపల్లికి రావడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు నిరంతర కరెంటు అందించాలని డిమాండ్ చేశారు.

4. ఏపీలో మళ్లీ వర్షాలు..

ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం మళ్లీ మారనుంది. రాగల మూడు రోజుల పాటు రాష్ట్రంతో పాటు యానాంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. తమిళనాడు, కేరళ పరిసరాల్లో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తనాల ప్రభావంతో వాతావరణంలో ఈ మార్పులు వస్తున్నాయి. ఆదివారం నుంచి మంగళవారం వరకు పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడవచ్చు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. ఈదురుగాలులు, పిడుగులు పడే సమయంలో ప్రజలు, రైతులు చెట్ల కింద నిలబడకుండా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని అధికారులు హెచ్చరించారు.

5.ఇండియా కూటమిలోకి విజయ్ టీవీకే

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామంగా ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే) పార్టీ ఇండియా కూటమిలో చేరింది. చెన్నైలో జరిగిన బహుళ పార్టీ సమావేశంలో ఈ నిర్ణయాన్ని తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి. మాణికం టాగోర్ అధికారికంగా ప్రకటించారు. ఈ చేరికతో తమిళనాడులో బీజేపీ వ్యతిరేక కూటమి మరింత బలపడుతుందని కాంగ్రెస్ నేతలు అభిప్రాయపడ్డారు. ఓటర్ల జాబితా సవరణ అంశంపై ఎన్నికల కమిషన్ చీఫ్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేపట్టాలని నిర్ణయించారు. అక్టోబర్ 13, 14 తేదీల్లో జిల్లా స్థాయి నిరసనలు, అక్టోబర్ 15న చెన్నైలో భారీ ఆందోళన కార్యక్రమం నిర్వహించనున్నట్లు ప్రకటించారు.

6.సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత..

ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు మరణంతో సినీ పరిశ్రమ విషాదంలో మునిగిపోయింది. తెలుగు, తమిళం, హిందీ సహా పలు భాషల్లో ప్రయోగాత్మక, వినూత్న చిత్రాలతో సింగీతం శ్రీనివాసరావు ప్రత్యేక గుర్తింపు పొందారు.‘రాజా పార్వై’, ‘విచిత్ర సోదరులు’, ‘మైఖేల్ మదన కామరాజు’, ‘కథాలా కథాలా’, ‘లిటిల్ జాన్’ వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. సింగీతం మరణంపై కమల్ హాసన్, ఎస్.ఎస్. రాజమౌళి, జూనియర్ ఎన్టీఆర్, వెంకటేశ్, నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, విష్ణు మంచు తదితర సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

7.డీప్ ఫేక్ పై చిరంజీవి ఆగ్రహం

కృత్రిమ మేధతో రూపొందించిన ‘చుట్టమల్లే’ పాటకు సంబంధించిన అసభ్యకర మార్ఫింగ్ వీడియోలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చర్యలు సిగ్గుచేటైనవి, ఏమాత్రం ఆమోదయోగ్యం కానివని ఖండించారు. ఇది ఒక్క వ్యక్తి లేదా సినిమా సమస్య కాదని, సమాజమంతా కలిసి పోరాడాల్సిన అంశమని పేర్కొన్నారు. ఇలాంటి కంటెంట్ సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, సినీ పరిశ్రమ తరఫున తాను కూడా చర్యలు చేపడతానని చిరంజీవి స్పష్టం చేశారు.

8.స్మిత్ యావత్ ప్రపంచానికి హీరో..

పైలట్ స్మిత్ మచ్చర్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడి, స్మిత్ మచ్చర్‌ను “ఇజ్రాయెల్, భారత్, ప్రపంచానికి హీరో”గా అభివర్ణించారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పవిత్ర జ్యోతిని వెలిగించే అత్యున్నత గౌరవానికి స్మిత్ మచ్చర్‌తో పాటు ప్రధాని నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించారు. సాధారణంగా ఇజ్రాయెల్ పౌరులకు మాత్రమే లభించే ఈ గౌరవానికి మచ్చర్‌ను ఎంపిక చేయడం ఆయన సాహసానికి లభించిన అరుదైన గుర్తింపుగా భావిస్తున్నారు.

9.ఉక్రెయిన్‌లో భారతీయ కంపెనీపై రష్యా దాడి

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మధ్య ఉక్రెయిన్‌లోని సుమీ నగరంలో ఉన్న భారతీయ సంస్థ ‘కుసుమ్ గ్రూప్’ ఫార్మా ప్లాంట్‌పై రష్యా డ్రోన్ దాడి జరిగింది.ఈ ఘటనలో ఒకరు మృతిచెందగా, పలువురు గాయపడ్డారు. మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. దాడి కారణంగా ప్లాంట్ ప్రధాన భవనం దాదాపు పూర్తిగా ధ్వంసమైంది, సుమారు రూ.400 కోట్ల మేర నష్టం జరిగినట్లు ప్రాథమిక అంచనాలు వెల్లడిస్తున్నాయి.

10.నేరాన్ని అంగీకరించిన ఫ్లైదుబాయ్‌ కో-పైలట్‌

ఫ్లైదుబాయ్‌ విమాన కో-పైలట్‌ హమామ్‌ అల్‌-హమ్మామీ విమానాన్ని కూల్చివేయాలనే ఉద్దేశంతో కెప్టెన్‌ స్మిత్‌ మచ్చర్‌పై పథకం ప్రకారం దాడి చేసినట్లు విచారణలో అంగీకరించాడు.ఈ కుట్ర వెనుక ఎవరున్నారనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అతడికి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలు లేదా ఇరాన్‌తో సంబంధాలున్నాయా అనే కోణంలో ఇజ్రాయెల్‌, సౌదీ అరేబియా అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అతడి సోషల్‌ మీడియా ఖాతాల్లో వేల సంఖ్యలో ఉగ్రవాద అనుకూల పోస్టులు, సందేశాలు గుర్తించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed