Last Updated:
Traffic Diversions: గణేశ్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భాగ్యనగరంలో కొలువుదీరిన సుప్రసిద్ధ ఖైరతాబాద్ వినాయకుడి దర్శనానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా లక్షలాదిగా భక్తులు తరలివస్తున్నారు.
భక్తుల రద్దీని నియంత్రించడంతో పాటు నగరంలో సాధారణ ట్రాఫిక్‌కు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు నగర ట్రాఫిక్ పోలీసులు పటిష్టమైన చర్యలు చేపట్టారు. ఉత్సవాల సందర్భంగా ఈ నెల 12వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిత్యం ఉదయం 11 గంటల నుంచి రాత్రి భక్తుల రద్దీ ముగిసే వరకు ట్రాఫిక్ ఆంక్షలు, వాహనాల మళ్లింపులు అమలులో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ డి.జోయెల్ డేవిస్ వెల్లడించారు. అవసరాన్ని బట్టి, భక్తుల రద్దీ తీవ్రతను బట్టి ఈ ఆంక్షలను ఎప్పటికప్పుడు సవరించనున్నట్లు స్పష్టం చేశారు.














