Last Updated:
ఒకప్పుడు టాలీవుడ్‌లో పెళ్ళి, స్నేహితులు, మానసిచ్చి చూడు వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన సీనియర్ హీరో వడ్డే నవీన్.. సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై హీరోగా మెరిశారు. ఆయన లేటెస్ట్ సినిమా ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు ఎలా ఉందొ ఇప్పుడు చూద్దాం.
ఒకప్పుడు టాలీవుడ్‌లో పెళ్ళి, స్నేహితులు, మానసిచ్చి చూడు వంటి వైవిధ్యమైన చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్‌కు దగ్గరైన సీనియర్ హీరో వడ్డే నవీన్.. సుమారు పదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ వెండితెరపై హీరోగా మెరిశారు. ఆయన స్వయంగా ‘వడ్డే క్రియేషన్స్’ బ్యానర్‌పై నిర్మించి, కథ-స్క్రీన్‌ప్లే అందించిన తాజా చిత్రం ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ (Transfer Trimurthulu) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. కమల్ తేజ నార్ల దర్శకత్వంలో ఒక ఇంటెన్స్ పోలీస్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా, వడ్డే నవీన్ కమ్‌బ్యాక్ కోసం ఎదురుచూస్తున్న అభిమానులను ఎంతవరకు అలరించిందో ఇప్పుడు చూద్దాం..
నిజాయితీకి మారుపేరైన కానిస్టేబుల్ త్రిమూర్తులు (వడ్డే నవీన్) లంచగొండితనానికి, అన్యాయానికి లొంగకపోవడం వల్ల తరచూ బదిలీలు (Transfers) ఎదుర్కొంటుంటాడు. ఈ క్రమంలోనే ఒక బదిలీపై తన తండ్రి గతంలో పనిచేసిన పాత పోలీస్ స్టేషన్‌కు వెళ్తాడు. అక్కడ అతనికి ఏళ్ల క్రితం జరిగిన ఒక గిరిజన యువతి ‘ప్రియమ్మ’ అత్యాచార కేసుకు సంబంధించిన పాత ఫైల్ దొరుకుతుంది. ఆ కేసును దర్యాప్తు చేసిన తన తండ్రి ఆశయం అసంపూర్తిగా మిగిలిపోయిందని తెలుసుకున్న త్రిమూర్తులు.. ఆ దారుణం వెనుక ఉన్న హోమ్ మంత్రి కమల కుమారుడు సంతోష్ బాబుపై ఎలా తిరుగుబాటు చేశాడు? రాజకీయ ఒత్తిళ్లను తట్టుకుని ప్రియమ్మ కుటుంబానికి ఎలా న్యాయం చేశాడు? అనేదే మిగిలిన కథ.
విశ్లేషణ: దర్శకుడు కమల్ తేజ సమాజంలో జరిగే రాజకీయ అన్యాయాలు, పోలీస్ వ్యవస్థలోని లోపాలను కమర్షియల్ హంగులతో చూపించే ప్రయత్నం చేశారు. సినిమా ప్రారంభంలోనే ప్రియమ్మ ఘటనతో కథ సీరియస్ టోన్‌లోకి వెళ్తుంది. ఫస్ట్ హాఫ్‌లో హీరో పాత్ర పరిచయం, అతని నిజాయితీ, కుటుంబ సన్నివేశాలతో కథ కాస్త నెమ్మదిగా సాగినప్పటికీ, ఇంటర్వెల్ బ్యాంగ్ ఆకట్టుకుంటుంది. సెకండ్ హాఫ్‌లో పాత ఫైల్ ఓపెన్ కావడం, హోమ్ మంత్రి వర్గంతో హీరో మైండ్ గేమ్స్ ఆడటం వంటి అంశాలు సినిమాకు ప్రధాన బలంగా నిలిచాయి. అయితే, కొన్ని సీన్లు పాతకాలపు పగ-ప్రతీకారం ఫార్మాట్‌లో సాగడం, స్క్రీన్‌ప్లే మరింత స్ట్రాంగ్ గా ఉండాల్సింది. ఎమోషన్స్ కొన్ని చోట్ల పండినా, మరికొన్ని చోట్ల మెలోడ్రామా ఎక్కువైంది.
చాలా కాలం తర్వాత స్క్రీన్‌పై కనిపించినా వడ్డే నవీన్ తన బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీతో మెప్పించారు. ఒక సీరియస్ పోలీస్ పాత్రకు ఆయన పర్ఫెక్ట్‌గా సూట్ అయ్యారు. అయితే యాక్షన్ సీక్వెన్స్‌లు, డ్యాన్స్‌ల విషయంలో ఆయన కాస్త ఇబ్బంది పడినట్లు కనిపించింది. హీరో భార్యగా గృహిణి పాత్రలో రాశి సింగ్ డీసెంట్‌గా నటించగా, దేవీ ప్రసాద్, శిల్పా తులస్కర్ తమ పాత్రల పరిధి మేర రాణించారు. సాంకేతికంగా కళ్యాణ్ నాయక్ అందించిన సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ (BGM) సినిమా మూడ్‌ను బాగా ఎలివేట్ చేశాయి.
ఫైనల్ లైన్.. రొటీన్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ.. ఒక సామాజిక సందేశంతో, వడ్డే నవీన్ మార్క్ యాక్టింగ్ కోసం ఈ ‘ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు’ చిత్రాన్ని చూడొచ్చు.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana
Jun 19, 2026 12:39 PM IST














