తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పాటుపై ప్రతిష్టంభన ఏర్పడింది. టీవీకే అధినేత విజయ్ సమర్పించిన ఎమ్మెల్యేల మద్దతు లేఖపై గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 118 మంది ఎమ్మెల్యేల బలం అవసరం కాగా, విజయ్ కేవలం 112 మంది మద్దతును మాత్రమే స్పష్టంగా చూపగలిగారు. మిగిలిన ఎమ్మెల్యేల సంతకాలు మరియు మద్దతు విషయంలో స్పష్టత లేదని గవర్నర్ భావిస్తున్నారు. దీంతో గురువారం జరగాల్సిన ప్రమాణస్వీకారానికి బ్రేక్ పడింది. మెజారిటీ నిరూపించుకోవడానికి మరికొంత సమయం కావాలని విజయ్ కోరగా, రాజ్యాంగ నిబంధనల ప్రకారం గవర్నర్ తన నిర్ణయాన్ని రిజర్వ్ చేశారు. ఈ పరిణామంతో అటు చెన్నైలో, ఇటు టీవీకే శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
Source link
Vijay’s Govt Bid Hits Roadblock | టీవీకే అధినేత విజయ్ దూకుడుకు బ్రేక్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










