Last Updated:
తిరుమల ఘాట్ రోడ్డులో కారు లోయలో పడి 72 ఏళ్ల సతీష్ కుమార్ మృతి. బెంగళూరు కుటుంబానికి చెందిన మరో ఇద్దరికి స్వల్ప గాయాలు.
శ్రీవారి దర్శనం ముగించుకుని ఇంటి దారి పట్టిన కుటుంబానికి తిరుమల ఘాట్ రోడ్డులో ఊహించని విషాదం ఎదురైంది. శుక్రవారం సాయంత్రం మొదటి ఘాట్ రోడ్డులోని 22వ మలుపు వద్ద కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొని లోయలోకి బోల్తా పడింది. ప్రమాదంలో 72 ఏళ్ల సతీష్ కుమార్ తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.













