Last Updated:
తిరుమల బ్రహ్మోత్సవాల భద్రతపై టీటీడీ, పోలీసులు సమీక్షించారు. వీవీఐపీ గెస్ట్‌హౌస్‌ల వద్ద పటిష్ట భద్రత, సిబ్బంది వివరాల నమోదుపై చర్చించారు.
తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందడి మొదలయ్యే వేళ.. భద్రతా ఏర్పాట్లపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. లక్షలాది మంది భక్తులు, వీఐపీలు, వీవీఐపీలు తరలివచ్చే అవకాశం ఉండటంతో చిన్నపాటి లోపానికి కూడా తావులేకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా తిరుమల పోలీసులు, టీటీడీ విజిలెన్స్ విభాగం కలిసి వీవీఐపీ గెస్ట్‌హౌస్ నిర్వాహకులతో ప్రత్యేక సమీక్ష నిర్వహించింది.














