తిరుమలకు సీఎం చంద్రబాబు.. 2 రోజుల పూర్తి షెడ్యూల్ ఇదే! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

తిరుమలలో సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన .. పూర్తి వివరాలు ఇలా!

News18
News18

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల పర్యటన నిమిత్తం మంగళవారం తిరుమల పుణ్యక్షేత్రానికి విచ్చేయనున్నారు. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే అపురూప ఘట్టంలో ఆయన పాల్గొంటారు. మంగళవారం సాయంత్రం 4 గంటలకు ఉండవల్లి నివాసం నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన పర్యటన ప్రారంభమవుతుంది. సాయంత్రం 5.30 గంటల సమయంలో తిరుపతిలోని ఎస్వీ వ్యవసాయ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గంలో ప్రయాణించి తిరుమలగిరులకు చేరుకుంటారు. ఈ పర్యటనకు సంబంధించి అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు పూర్తి చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *