Last Updated:
తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేద మంత్రోచ్ఛారణలతో, ప్రత్యేక హోమాలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.
తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆలయ ప్రాంగణం వేద మంత్రోచ్ఛారణలతో మార్మోగగా.. స్వామివారి పవిత్ర ప్రతిష్ట కార్యక్రమం ఆగమ శాస్త్ర సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించారు. ప్రత్యేక హోమాలు, వైదిక క్రతువులు, పూజా కైంకర్యాలతో ఆలయంలో భక్తి, ఆధ్యాత్మికత వెల్లివిరిసింది. పవిత్రోత్సవాల తొలిరోజు జరిగిన విశేష కార్యక్రమాలు భక్తులకు దివ్యానుభూతిని కలిగించాయి.













