అయితే కొన్ని ఖర్చులు ప్యాకేజీలో ఉండవు. స్మారక చిహ్నాల ఎంట్రీ ఫీజులు, బోటింగ్, అడ్వెంచర్ స్పోర్ట్స్, లోకల్ గైడ్స్ ఛార్జీలు, ప్రత్యేకంగా ప్యాకేజీలో పేర్కొనని ఇతర సందర్శనా ఖర్చులను ప్రయాణికులే చెల్లించాలి. భోజనం ముందుగానే నిర్ణయించిన మెనూ ప్రకారమే ఉంటుంది. తమకు నచ్చిన మెనూను ఎంచుకునే అవకాశం ఉండదు. గదిలో రూమ్ సర్వీస్ తీసుకుంటే దానికి అదనంగా ఛార్జీ చెల్లించాలి. లాండ్రీ, మినరల్ వాటర్, సాధారణ మెనూలో లేని ఆహారం లేదా పానీయాల వంటి వ్యక్తిగత ఖర్చులను కూడా ప్రయాణికులే భరించాలి. డ్రైవర్లు, వెయిటర్లు, గైడ్లు, ప్రతినిధులకు ఇవ్వాల్సిన టిప్స్‌తో పాటు ఫ్యూయల్ సర్‌చార్జ్, ప్యాకేజీలో ప్రత్యేకంగా చేర్చని ఇతర ఖర్చులను కూడా విడిగా చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా చూస్తే, అయోధ్య–కాశీ పుణ్య క్షేత్ర యాత్ర విత్ బైద్యనాథ్ ధామ్ టూర్లో ప్రముఖ ఆలయాలు, చారిత్రక కట్టడాలు, పవిత్ర నదీ సంగమ ప్రాంతాలను ఒకే ప్రయాణంలో సందర్శించే అవకాశం ఉంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లే భక్తులకు తూర్పు, ఉత్తర భారతదేశంలోని ఆరు ముఖ్యమైన పుణ్యక్షేత్రాలు, వారసత్వ ప్రాంతాలను ఒకే ప్యాకేజీ రైలు యాత్రలో చూసే అవకాశం ఈ టూర్ కల్పిస్తోంది. మరిన్ని వివరాలకు 92810 30711 నెంబర్లో కాంటాక్ట్ చేయొచ్చు. https://www.irctctourism.com/ వెబ్సైట్లో ప్యాకేజీ వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)













