Last Updated:
తిరుమలలో బండ్ల గణేష్ సందడి.. కూతురి పెళ్లి గురించి చెబుతూ భావోద్వేగం!
ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేష్ గురువారం ఉదయం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారిని దర్శించుకుని పునీతులయ్యారు. వీఐపీ విరామ సమయంలో ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు సంప్రదాయబద్ధంగా వేదాశీర్వచనం అందించారు. అనంతరం టీటీడీ ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో ఘనంగా సత్కరించారు. ఆ కలియుగ దైవం ఆశీస్సులతోనే తన బిడ్డ వివాహం ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందని ఈ సందర్భంగా ఆయన అత్యంత ఆనందం వ్యక్తం చేశారు.













