Last Updated:
భారత రక్షణ రంగానికి మరింత బలాన్నిస్తూ మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), డ్రోగో ఏరోస్పేస్ సంస్థలు కీలక ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ భాగస్వామ్యంతో దేశీయంగా మానవరహిత వైమానిక వాహనాలు, అత్యాధునిక కామికేజ్ ఆత్మాహుతి డ్రోన్ల అభివృద్ధికి మార్గం సుగమమైంది.
భారత రక్షణ రంగంలో స్వదేశీ సాంకేతికతకు మరింత ఊతమిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే డిఫెన్స్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ (డీపీఎస్యూ) మ్యూనిషన్స్ ఇండియా లిమిటెడ్ (ఎంఐఎల్), డ్రోగో ఏరోస్పేస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థలు ఒక కీలక అవగాహన ఒప్పందం (ఎంవోయూ) కుదుర్చుకున్నాయి. దేశీయంగా మానవరహిత వైమానిక వాహనాలు (యూఏవీలు), లోయిటరింగ్ మ్యూనిషన్ వ్యవస్థల రూపకల్పన, అభివృద్ధి, సమీకరణ కోసం ఈ రెండు సంస్థలు ఇకపై కలిసి పనిచేయనున్నాయి.














