అల్పపీడన ద్రోణి ప్రభావం, తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన-ap ts rains alert due depression in west bay of bengal north east monsoon ,తెలంగాణ న్యూస్

ఏపీకి వర్షసూచన

వాతావరణ శాఖ ఏపీకి వర్షసూచన చెప్పింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావం, తమిళనాడులో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతం నుంచి ఏపీ వైపు తూర్పుగాలులు వీస్తున్నాయి. దీంతో ఈశాన్య రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. దీంతో కోస్తా, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడ్డాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధవారం… అల్లూరి సీతారామరాజు, కోనసీమ, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్‌ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది.

Source link