Last Updated:
పుతిన్ నుంచి ప్రధాని మోదీకి వచ్చిన ఆహ్వానాన్ని ఆయన అంగీకరించారు. రష్యాలో జరగనున్న ఈ కీలక భేటీలో వాణిజ్యం, రక్షణ, సాంకేతికతతో పాటు మరో ముఖ్యమైన అంశంపై పెద్ద నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.
న్యూఢిల్లీలో జరిగిన బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం సందర్భంగా భారత్, రష్యా మధ్య తదుపరి కీలక సమావేశానికి ప్రణాళిక ఖరారైంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్.. ప్రధాని నరేంద్ర మోదీని 24వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రష్యాకు రావాల్సిందిగా అధికారికంగా ఆహ్వానించారు. ఈ ఆహ్వానాన్ని ప్రధాని మోదీ కూడా అంగీకరించారు. అయితే ఇరుదేశాల పరస్పర సౌలభ్యాన్ని బట్టి పర్యటన తేదీలను దౌత్య మార్గాల ద్వారా నిర్ణయించనున్నారు. ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, పశ్చిమ దేశాల కఠిన ఆంక్షలు, మారుతున్న అంతర్జాతీయ రాజకీయ పరిణామాల నేపథ్యంలో ప్రధాని మోదీ రష్యా పర్యటనకు ఎంతో ప్రాధాన్యత ఏర్పడింది.














