భారత్ మండపంలో చైనా అధ్యక్షుడికి మోదీ ఘన స్వాగతం.. అట్టహాసంగా బ్రిక్స్ సదస్సు! | | ACTPnews

credit:pti


Last Updated:

భారత్ మండపంలో 18వ బ్రిక్స్ సదస్సు ప్రారంభమైంది. ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. గాల్వాన్ తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి.

credit:pti
credit:pti

భారత రాజధాని న్యూఢిల్లీలోని ప్రతిష్టాత్మక భారత్ మండపం వేదికగా 18వ బ్రిక్స్ సదస్సు అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు హాజరైన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఘన స్వాగతం పలికారు. 2020 గాల్వాన్ ఘర్షణల తర్వాత జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. భారత్ మండపానికి చేరుకున్న చైనా అధ్యక్షుడిని మోదీ ఆత్మీయంగా ఆహ్వానించి లోపలికి తీసుకెళ్లారు. ఈ ఇద్దరు అగ్ర నేతల కలయికతో సదస్సు ప్రాధాన్యత మరింత పెరిగింది. సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరగనుండటంతో ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed