Last Updated:
పార్లమెంట్‌లో ప్రతిపక్షం వర్సెస్ ప్రభుత్వం పోరు కొనసాగుతున్న వేళ.. NDAలో కీలక సమావేశం జరిగింది. ‘మంగళ్ మిలన్’ పేరుతో జరిగిన ఈ భేటీలో ప్రధాని మోదీ, అమిత్ షా సహా కీలక నేతలు పాల్గొన్నారు.
పార్లమెంట్‌లో కొనసాగుతున్న వర్షాకాల సమావేశాల నేపథ్యంలో అధికార ఎన్డీఏ కూటమి కీలక వ్యూహ సమావేశం నిర్వహించింది. ఇప్పటివరకు NDA Parliamentary Party Meetingగా పిలిచిన ఈ వారపు సమావేశానికి ‘మంగళ్ మిలన్’ అనే కొత్త పేరు పెట్టారు. సాధారణంగా పార్లమెంట్ సమావేశాలు జరిగే సమయంలో ప్రతి మంగళవారం ఉదయం నిర్వహించే ఈ భేటీ.. కూటమి పార్టీల మధ్య సమన్వయం, పార్లమెంటరీ వ్యూహాల రూపకల్పనకు ప్రధాన వేదికగా మారింది. ఈ పేరును 2026 జూలైలో అధికారికంగా మార్చినట్లు నివేదికలు వెల్లడించాయి.














