Last Updated:
టీటీడీ బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబును ఆహ్వానించింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం సూచించారు.
తిరుమల శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల సందడి మొదలుకానున్న వేళ టీటీడీ కీలక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించింది. అమరావతిలోని సీఎం నివాసానికి వెళ్లిన టీటీడీ ప్రతినిధులు స్వామివారి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రికను ముఖ్యమంత్రికి అందజేశారు.














