Last Updated:
Bihar Protests: ఇప్పుడు దేశంలో పేపర్ లీకేజీల సిరీస్ నడుస్తోంది. నీట్, జార్ఖండ్ తర్వాత.. ఇప్పుడు బీహార్ రచ్చ మొదలైంది. నిర్వాహకులు సరిగ్గా నిర్వహించకుండా.. విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారు. వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారు.
బీహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం వేచి ఉన్న యువతలో అసంతృప్తి పెరుగుతోంది. 70వ బీహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (బీపీఎస్సీ) పరీక్షలో కథిత పేపర్ లీక్, అక్రమాలు ఉన్నాయని ఆరోపిస్తూ విద్యార్థులు ఆగస్టు 25న పాట్నాలో భారీ ఆందోళనలు చేపట్టారు. గార్దనీబాగ్లో చాలా రోజులుగా ధర్నా కొనసాగుతున్న విద్యార్థులు ఇవాళ గాంధీ మైదాన్ నుంచి రాజ్‌భవన్, ముఖ్యమంత్రి నివాసం వైపు మార్చ్ చేశారు. పోలీసులు పెద్ద సంఖ్యలో మోహరించి బారికేడ్లు వేశారు. విద్యార్థులు ఆ బారికేడ్లను తొలగించి ముందుకు సాగడానికి ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది.














