Last Updated:
నేపాల్-చైనా సరిహద్దుల్లో సంభవించిన పెను వరదల కారణంగా చైనా వైపు చిక్కుకుపోయిన 400 మందికి పైగా భారతీయులు క్షేమంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం అధికారికంగా వెల్లడించింది.
నేపాల్-చైనా సరిహద్దుల్లో సంభవించిన పెను వరదల కారణంగా చైనా భూభాగంలో చిక్కుకుపోయిన 400 మందికి పైగా భారతీయులు పూర్తి సురక్షితంగా ఉన్నారని భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ శుక్రవారం ప్రకటించారు. బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం స్థానిక చైనా అధికారులు, టూర్ లీడర్లు, ట్రావెల్ ఏజెంట్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని వెల్లడించారు. బాధితుల కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లను సైతం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.














