Last Updated:
Hyderabad: సుమారు కోటి మందికిపైగా నివసించే ఈ గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో రోడ్లు గుంతలు పడి అధ్వాన్నంగా తయారైతే జీహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఓ పౌరుడు వినూత్న నిరసనకు దిగాడు.
Hyderabad: హైదరాబాద్ పేరుకే మహానగరం. చినుకు పడితే చాలు నగరంలోని రోడ్లలో ప్రయాణించాలంటే మహానరకం. ఇది ఇప్పుడున్న సమస్య కాదు. ప్రతీ ఏడాది వర్షాకాలం వస్తే చాలు హైదరాబాదీలకు రహదారుల కష్టాలు వర్ణనాతీతం అనే చెప్పాలి. సుమారు కోటి మందికిపైగా నివసించే ఈ గ్రేటర్ హైదరాబాద్ మెట్రోపాలిటన్ సిటీలో రోడ్లు గుంతలు పడి అధ్వాన్నంగా తయారైతే జీహెచ్ఎంసీ అధికారులు, ప్రభుత్వ పాలకులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తూ ఓ పౌరుడు వినూత్న నిరసనకు దిగాడు.రోడ్లపై గుంతలు పడి బురద నిలిచిన చోటే పడుకుని నిరసన తెలిపాడు. సోషల్ మీడియాలో ఇప్పుడు అతను చేసిన పని వైరల్ అవుతోంది. చాలా మంది అతను చేసిన నిరసన కార్యక్రమానికి మద్దతిస్తున్నారు. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగిన ఈ గుంతలు రిపేర్ చేస్తారా లేదా! అని ఓ వ్యక్తి చేసిన వీడియో నెట్టింట్లో రచ్చరచ్చ అవుతోంది.














