Lionel Messi: ఆట మునుపటిలా ఉండదు! మెస్సీ రిటైర్మెంట్‌.. సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగ పోస్ట్ | క్రీడా వార్తలు | ACTPnews

లియోనెల్ మెస్సీతో రేవంత్ రెడ్డి


Last Updated:

Lionel Messi: ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం, అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనెల్ మెస్సీ ఆటకు వీడ్కోలు పలికిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోషల్ మీడియా వేదికగా స్పందించారు.

లియోనెల్ మెస్సీతో రేవంత్ రెడ్డి
లియోనెల్ మెస్సీతో రేవంత్ రెడ్డి

మెస్సీతో గతంలో హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో కలిసి దిగిన ఫొటోను పంచుకుంటూ ‘ఎక్స్’ వేదికగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి తన పోస్ట్‌లో పేర్కొంటూ— “ప్రియమైన మెస్సీ.. మీరు దశాబ్దాల పాటు ప్రపంచ ఫుట్‌బాల్‌ను ఎంతగానో అలరించారు. ఆటతో కోట్ల మందిని ఉత్సాహపరిచి, యువతలో అపారమైన స్ఫూర్తిని నింపారు. హైదరాబాద్ పర్యటన సందర్భంగా మీతో కలిసి ఫుట్‌బాల్ మైదానంలో కాసేపు గడపడం నాకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. ‘గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT) అయిన మీరు లేని ఫుట్‌బాల్ మైదానం ఇకపై మునుపటిలా ఉండదు. మైదానం వీడినా మీ ఆట, మీ వ్యక్తిత్వం అందించిన స్ఫూర్తి ఎప్పటికీ ఇలాగే కొనసాగాలి” అని ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports