Last Updated:
Abhinandan Varthaman News: అభినందన్ వర్దమాన్ ఈ పేరు చాలా ఫేమస్. భారతీయుల్లో అతని ధైర్యసాహసాలు, దేశం పట్ల అతను చూపించిన అంకితభావం, శత్రుదేశంలో చేతిలో చిక్కితే దేశ భద్రత, గోప్యతను కాపాడేందుకు ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన నిజమైన వీరసైనికుడిగా చరిత్రలో తన పేరు లిఖించుకున్న వ్యక్తిగా సుపరిచితుడు.
Abhinandan Varthaman News: అభినందన్ వర్దమాన్ ఈ పేరు చాలా ఫేమస్. భారతీయుల్లో అతని ధైర్యసాహసాలు, దేశం పట్ల అతను చూపించిన అంకితభావం, శత్రుదేశంలో చేతిలో చిక్కితే దేశ భద్రత, గోప్యతను కాపాడేందుకు ప్రాణాల్ని సైతం పణంగా పెట్టిన నిజమైన వీరసైనికుడిగా చరిత్రలో తన పేరు లిఖించుకున్న వ్యక్తిగా సుపరిచితుడు. భారత వైమానిక దళ గ్రూప్ కెప్టెన్ అభినందన్ వర్ధమాన్ వైమానిక దళం నుండి వైదొలిగి F-91 అనే ప్రైవేట్ విమానయాన సంస్థలో చేరారు. 2019 ఫిబ్రవరి 27న, నియంత్రణ రేఖ (LoC) వెంబడి జరిగిన గగనతల పోరాటంలో, అభినందన్ తన మిగ్-21 బైసన్ విమానాన్ని ఉపయోగించి ఒక పాకిస్తానీ F-16 యుద్ధ విమానాన్ని కూల్చివేశారు. ఆ తర్వాత ఆయన విమానం క్షిపణి దాడికి గురైంది. పాకిస్థాన్‌లో సుమారు 60 గంటల పాటు నిర్బంధంలో ఉన్న అనంతరం ఈ భారత వీర సైనికుడు 2019 మార్చి 1న భారతదేశానికి తిరిగి వచ్చారు. ఆయన ప్రదర్శించిన ఈ ధైర్యసాహసాలకు గాను కేంద్ర ప్రభుత్వం ‘వీర చక్ర’ పురస్కారంతో సత్కరించింది.














