Hyderabad: హైదరాబాద్‌లో సిటీ బస్సు ఎక్కితే.. గమ్యానికా లేక గగనానికా..!, వైరల్ వీడియో ఇదే | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad RTC Bus Overcrowding


Last Updated:

Hyderabad: తెలంగాణలో ప్రజా రవాణా అద్భుతంగా ఉందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. కొత్త బస్సులు, శివారు ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సిటీ సర్వీసులు.. ఐటీ కారిడార్, సాఫ్ట్ వేర్ లొకేషన్స్‌కి నైట్ టైమ్ కూడా బస్సులు నడుపుతున్నామని చెబుతోంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది.

Hyderabad RTC Bus Overcrowding
Hyderabad RTC Bus Overcrowding

Hyderabad: తెలంగాణలో ప్రజా రవాణా అద్భుతంగా ఉందని ప్రభుత్వం చెప్పుకుంటోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తూనే ప్రయాణికుల కోసం కొత్త బస్సులు, శివారు ప్రాంతాలకు కూడా ఆర్టీసీ సిటీ సర్వీసులు.. ఐటీ కారిడార్, సాఫ్ట్ వేర్ లొకేషన్స్‌కి నైట్ టైమ్ కూడా బస్సులు నడుపుతున్నామని చెబుతోంది. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. రెండో వైపు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉందని సోషల్ మీడియా వేదికగా మేధావులు, బాధ్యతగల పౌరులు ఆధారాలను చూపిస్తూ ఆరోపిస్తున్నారు. పద్మవ్యూహం లాంటి ట్రాఫిక్ జామ్‌‌లో సొంత వెహికల్‌తో ఇబ్బంది పడటం దేనికి అని ఆర్టీసీ సిటీ బస్సులను నమ్ముకుంటున్న విద్యార్ధులు, ఉద్యోగులు, యువతకు ప్రజారవాణా గాల్లో ప్రాణాల్లా మారిపోయింది. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మార్గంలో వెళ్లే బస్సుల్లో ప్రయాణికులు సామర్ధ్యానికి మించి కాకుండా చివరకు ఫుట్ బోర్డుపై కూడా వేలాడుతూ..ఒకరి కాళ్లపై మరొకరు నిలబడి జర్నీ చేయాల్సిన దుస్థితి తలెత్తింది. భరద్వాజ్(భారత్ మాతాకి పరివార్) పేరుతో ఓ నెటిజన్ ట్విట్టర్‌(ఎక్స్)లో వీడియో పోస్ట్ చేసి పాలకుల్ని సూటిగా ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ప్రజా రవాణా పరిస్థితి ఇది అంటూ దీనికి ఓ పరిష్కారం చూపించమని వేడుకుంటున్నారు.

గమ్యానికా లేక పైకా..

హైదరాబాద్‌ జంటనగరాల్లో రోజు రోజుకు జనాభా సంఖ్య పెరుగుతోంది. చదువు, ఉద్యోగం, ఉపాధి కోసం వచ్చేవారితో సిటీతో పాటు శివారు ప్రాంతాలు కూడా రద్దీగా మారుతున్నాయి. అయితే ప్రజారవాణా వ్యవస్థ ప్రజలకు, నగరవాసులకు తగిన విధంగా ప్రయాణ సౌకర్యాలు కల్పించడంలో విఫలమైందనే విమర్శలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ప్రజాపాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత శివారు ప్రాంతాలకు సైతం బస్సులు వేసినప్పటికి.. రద్దీకి తగినట్లుగా సర్వీసులు అందుబాటులో లేవనే ఆరోపణలున్నాయి. ఇందుకు ఉదాహరణే భరద్వాజ్(భారత్ మాతాకి పరివార్)అనే ఓ నెటిజన్ షేర్ చేసిన వీడియో సజీవ సాక్షంగా మారింది. మేడ్చల్ డిపోకి చెందిన బస్ నంబర్ -AP 20z 0088 సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ రూట్లో ప్రయాణించే ఓ బస్ ఫుల్ రష్‌గా ఉండటే కాకుండా కెపాసిటీకి మించి అంటే ఫుట్ బోర్డుపై కూడా యువకులు ఒకరి కాళ్లపై మరొకరు నిల్చొని గాల్లో వేలాడుతూ.. ప్రాణాల్ని పణంగా పెట్టి ప్రయాణిస్తున్న వీడియోని షేర్ చేయడంతో ఆ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది.

సిటీ బస్సుల్లో వెళ్తే..

అంతే కాదు భరద్వాజ్ అనే సామాజిక బాధ్యత కలిగిన పౌరుడు హైదరాబాద్‌లో ప్రజా రవాణా పరిస్థితి ఇది మహాప్రభో అంటూ పాలకులకు కళ్లు తెరిపించే ప్రయత్నం చేశారు. ట్రాఫిక్ తగ్గించడం కోసం ఎవరైనా తమ ప్రాణాలను ఎందుకు పణంగా పెడతారు?..పౌరులను ఏదైనా అడిగే ముందు, ముందుగా వారికి ఆ పని చేసే అవకాశాన్ని కల్పించాలని .. వారి సొంత వాహనాలు ఇచ్చే సౌకర్యాన్ని వారికి కల్పించండి అంటూ కామెంట్ పెట్టాడు.

పాలకులారా చూస్తున్నారా..

దీనిపై నెటిజన్లతో పాటు హైదరాబాద్ పౌరులు కూడా స్పందిస్తున్నారు. చాలా రూట్లలో ఆర్టీసీ ట్రాఫిక్‌కి తిగిన విధంగా బస్సు సర్వీసులు అందుబాటులో లేవని.. మరీ ముఖ్యంగా ఉదయం, సాయంత్రం ఆఫీసులు, కాలేజీలకు వెళ్లే సమయం, వచ్చే సమయంలో తక్కువగా ఉండటం వల్లే ఈవిధంగా బస్సుల్లో సర్కస్ ఫీట్స్ చేయాల్సి వస్తోందని కామెంట్స్ చేస్తున్నారు. దయచేసి ఈ వీడియో చూసిన తర్వాతైనా ఆర్టీసీ సంస్థ నిర్వాహకులు, అధికారులు, సంబంధింత శాఖ మంత్రి స్పందించాలని.. ప్రజల ప్రాణాలకు హాని కలగకుండా ప్రజారవాణా సౌకర్యాలను మెరుగుపరచాలని కోరుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports