Last Updated:
Chess Tournament: వరంగల్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హనుమకొండ వికాస్ హైస్కూల్లో ఈ నెల 17న అండర్ 11 చదరంగం ఎంపిక పోటీలు, విజేతలు జూన్ 19 నుంచి హైదరాబాద్ రాష్ట్రస్థాయి పోటీలకు అర్హులు
క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం ఆరోగ్యంగా ఉండేందుకు ఎంతో దోహదపడతాయి. యువత క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎదిగేందుకు ప్రభుత్వాలు పెద్ద పీట వేస్తున్నాయి. యువతలో క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించే దిశగా ముందుకు వెళ్తున్నాయి. ఒకవైపు క్రీడా అసోసియేషన్స్ సైతం టోర్నమెంట్లు నిర్వహిస్తూ యువతను ప్రోత్సహిస్తున్నాయి.
చదరంగం ఆట అంటే విజ్ఞానం, పరిజ్ఞానం, వ్యూహాత్మకత, కళా నైపుణ్యం కలిసి ఉంటాయి. ఈ ఆట ఆడడం ద్వారా మేధాశక్తితో పాటు ఏకాగ్రత పెరుగుతుంది. అయితే యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాన్ని వెలికి తీసి వారి ఏకాగ్రతతో పాటు మేధా శక్తిని పెంపొందించే దిశగా తెలంగాణ రాష్ట్ర చెస్ అసోసియేషన్ ముందు అడుగు వేసింది.
చెస్ పై ఆసక్తి ఉన్న క్రీడాకారులకు చెస్ అసోషియేషన్ శుభవార్త తెలిపింది. వరంగల్ జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 17న అండర్- 11 ఆధారంగా ఎంపిక పోటీలో నిర్వహిస్తున్నట్లు చెస్ అసోసియేషన్ కార్యదర్శి కన్నా ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 17న బాలబాలికలకు వేరు వేరుగా ఎంపిక పోటీలు ఉంటాయన్నారు. ఈ పోటీలు హనుమకొండ నగరంలోని రెడ్డి కాలనీ ప్రాంతంలో ఉన్నటువంటి వికాస్ హైస్కూల్లో ఉంటాయన్నారు. ఈ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులు జనవరి 1 2015న ఆ తర్వాత జన్మించిన వారు అర్హులను తెలిపారు.
ఇందులో గెలుపొందిన నలుగురు బాలురు, నలుగురు బాలికలను జూన్ 19 నుంచి 21 వరకు హైదరాబాదులో జరిగే రాష్ట్రస్థాయి చదరంగా పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి అర్హత కలిగిన క్రీడాకారులు ఈ నెల 17న నిర్వహించే ఈ చదరంగ పోటీల్లో తమ జనన ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలన్నారు. మరిన్ని వివరాలకు90595 22986 నెంబర్ ను సంప్రదించాలన్నారు.
లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్, మ్యాచ్ అప్డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













