Last Updated:
PM Modi Italy Visit: ఇటలీ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఆ దేశ ప్రధాని జార్జియా మెలోనీకి ఇచ్చిన గిఫ్ట్ ఇప్పుడు వైరల్ అయ్యింది. ఆ గిఫ్టు గురించి నెటిజన్లు బాగా మాట్లాడుకుంటున్నారు. అసలు ఆ గిఫ్టేంటో చూద్దాం.
ప్రధాని నరేంద్ర మోదీ 5 దేశాల పర్యటనలో భాగంగా.. మే 19న ఇటలీ రాజధాని రోమ్‌కు చేరుకున్నారు. ఇది ఆయన ఐదు దేశాల పర్యటనలో చివరి దశ. ఇటాలియన్ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానం మేరకు ఆయన ఈ పర్యటన చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ.. ఆమెకు మెలోడీ చాక్లెట్ల ప్యాకెట్‌ని గిఫ్టుగా ఇవ్వడం వైరల్ అయ్యింది.
మెలోనీ, మోదీ స్నేహాన్ని.. మెలోడీగా పిలుచుకుంటారు నెటిజన్లు. ఇలాంటి సమయంలో.. సరిగ్గా మెలోడీ చాక్లెట్లనే మోదీ గిఫ్టుగా ఇవ్వడం హాట్ టాపిక్ అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియోని షేర్ చేసిన మెలోనీ.. ప్రధాని మోదీకి ధన్యవాదాలు తెలిపారు.
ఈ పర్యటనలో భాగంగా రెండు దేశాల నేతలూ కీలక చర్చలు జరిపారు. ఈ భేటీలో వాణిజ్యం, రక్షణ, శుభ్రమైన ఇంధనం, సాంకేతికత, ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఎకనామిక్ కారిడార్ (IMEC) వంటి అంశాలపై దృష్టి సారించారు. రెండు దేశాల మధ్య ఉన్న స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌ను స్పెషల్ స్ట్రాటజిక్ పార్టనర్‌షిప్‌గా అప్‌గ్రేడ్ చేసే దిశగా చర్చలు జరిగాయి.
మెలోడీ నైన్టీస్ మెమరీస్:
మెలోడీ అనేది నైన్టీస్ కిడ్స్‌కి అత్యంత ఇష్టమైన చాక్లెట్లలో ఒకటి. అప్పట్లో మహాలాక్టో, ఆశ, మెలోడీ లాంటి చాక్లెట్లు ఎంతగానో ప్రజాదరణ పొందాయి. ముఖ్యంగా మెలోడీ అనేది మెత్తగా ఉంటూ.. కాఫీ టేస్ట్ ఇస్తూ పిల్లలకు బాగా నచ్చేది. పెద్ద వాళ్లు కూడా ఈ చాక్లెట్ తింటే.. కాఫీ తాగినట్లే ఉంటుందని అనే వారు.. ఇలా ఈ చాక్లెట్లు అన్ని వయసుల వారినీ అలరించాయి. ఐతే.. ఎన్నో చాక్లెట్లు ఉన్నా.. ప్రధాని మోదీ.. ఈ చాక్లెట్లనే జార్జియా మెలోనీకి ఇవ్వడానికి కారణం.. మోదీ, మెలోనీ స్నేహాన్ని నెటిజన్లు మెలోడీ అని పిలవడమే. ఇందులో మెలో అనేది మెలోనీ పేరు కాగా.. మోడీలో డీని ఉపయోగిస్తున్నారు.
ఇప్పుడు ఇండియాలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మెలోడీ చాక్లెట్ గిఫ్ట్ హాట్ టాపిక్ అయ్యింది. నెటిజన్లు మెలోనీ వీడియో క్లిప్‌ని బాగా షేర్ చేస్తున్నారు. సరదాగా పిలిస్తే, నిజంగానే మెలోడీ గిఫ్ట్ ఇచ్చారే అని ఆశ్చర్యం, సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
దీనికి ముందు.. జార్జియా.. ప్రధాని మోదీతో ఓ సెల్ఫీ దిగారు. దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇద్దరు నేతలూ రోమ్ లోని కొలోసియం సందర్శించి సెల్ఫీ తీసుకున్నారు. ఈ సెల్ఫీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనికి “మెలోడీ టీమ్” అనే హ్యాష్‌ట్యాగ్‌తో పాత సందర్భాలు మళ్లీ గుర్తు చేసుకోసుకున్నారు.
ప్రధాని మోదీ ఇటలీ పర్యటన.. సెల్ఫీ దిగిన జార్జియా మెలోనీ (Image credit – x – @GiorgiaMeloni)
ఇదివరకు వివిధ పర్యటనల్లో కొన్నిసార్లు మెలోనీ, మోదీ కలిశారు. అప్పుడు కూడా ఇలాగే వారి మధ్య స్నేహం చిగురించింది. ఇప్పుడు సెల్ఫీలు, గిఫ్టులతో మరింత పెరిగింది. ఇలాంటి స్నేహ బంధాలు.. భారత్‌తో ఇతర దేశాల మధ్య సఖ్యతను మరింత పెంచుతాయనీ.. దేశాల మధ్య యుద్ధ వాతావరణాలు లేకుండా.. స్నేహ భావం ఉంటుందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఈ పర్యటన భారత్-ఇటలీ సంబంధాల్లో కొత్త మైలురాయి. సోషల్ మీడియా “మెలోడి” ట్రెండ్‌తో నిండిపోయింది. ఇది రాజకీయాలకు మించి ప్రజల మధ్య స్నేహాన్ని ప్రతిబింబిస్తుంది. అధికారిక చర్చలు ఆర్థిక, స్ట్రాటజిక్ లాభాలు తెస్తాయని ఆశ. రెండు దేశాలు గ్లోబల్ ఇష్యూలైన టెర్రరిజం, క్లైమేట్ చేంజ్, ఫుడ్ సెక్యూరిటీలపై కలిసి పని చేస్తున్నాయి. మోదీ పర్యటన విజయవంతం కావాలని భారతీయులు ఆశిస్తున్నారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana
May 20, 2026 12:34 PM IST
















