Last Updated:
Drone Attack: రష్యా నుంచి పాకిస్థాన్లోని కరాచీ నగరానికి బయల్దేరిన ఒక వాణిజ్య కార్గో నౌకపై సముద్ర మార్గంలో గుర్తుతెలియని డ్రోన్ దాడి జరిగింది.
ఈ నౌకలో మొత్తం 23 మంది భారతీయ నావికులు విధులు నిర్వర్తిస్తుండగా, అంతా ప్రాణాపాయం నుంచి సురక్షితంగా బయటపడటంతో అధికారులు, నావికుల కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. రష్యాలోని నోవోరోసిస్క్ పోర్టు నుంచి బయల్దేరిన ఈ నౌక ప్రయాణిస్తున్న సమయంలో ఈ అనూహ్య దాడి చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే సిబ్బంది చూపిన సమయస్ఫూర్తి వల్ల పెను విపత్తు తప్పింది.














