Last Updated:
చెన్నై వేదికగా జరుగుతున్న దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్ కెప్టెన్ తిలక్ వర్మ.. ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్ వైభవ్ సూర్యవంశీని స్లెడ్జింగ్ చేశాడు. సిరాజ్‌ను ఉతికారేసిన ఈ 15 ఏళ్ల కుర్రాడు హాఫ్ సెంచరీకి చేరువలో ఔటయ్యాడు.
చెన్నైలోని ప్రతిష్టాత్మక ఎంఏ చిదంబరం స్టేడియంలో ఆదివారం సౌత్ జోన్, ఈస్ట్ జోన్ జట్ల మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ అత్యంత ఆసక్తికరంగా సాగుతోంది. ఈ కీలక పోరులో ఈస్ట్ జోన్ వైస్ కెప్టెన్, 15 ఏళ్ల యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే చెలరేగిపోయాడు. సౌత్ జోన్ బౌలర్లను, ముఖ్యంగా టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను అతడు లక్ష్యంగా చేసుకున్నాడు. సిరాజ్ వేసిన ఒకే ఓవర్లో రెండు ఫోర్లు, ఒక భారీ సిక్సర్ బాది సత్తా చాటాడు. ఫీల్డింగ్ సెటప్‌లో ఉన్న గ్యాప్స్‌ను వాడుకుంటూ సునాయాసంగా బౌండరీలు రాబట్టాడు.














