ఉత్తరప్రదేశ్‌లోని మిర్జాపూర్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. అహరోరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్ఎస్ రంజన్ స్టోన్ క్రషర్ ప్లాంట్‌లో పునాది ర్యాంప్ కుంగిపోయి ప్లాంట్ ఆఫీస్ భవనం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆఫీసులో ఉన్న నలుగురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుని అక్కడికక్కడే మృతి చెందారు. మృతులను సోన్‌భద్ర జిల్లాకు చెందిన లాల్ బహదూర్, అశోక్, రాకేష్, దుర్యోధన్లుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు జేసీబీల సహాయంతో శిథిలాలను తొలగించారు. ఈ ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
Source link
4 Workers Killed as Building Collapses : మిర్జాపూర్‌లో ఘోర ప్రమాదం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports











