Hyderabad: హైదరాబాద్‌లో ఏఐ విప్లవం.. రూ.70 వేల కోట్లతో దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్! | తెలంగాణ వార్తలు | ACTPnews

టీసీఎస్ ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు


Last Updated:

Hyderabad: గ్లోబల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విప్లవంలో సరికొత్త చరిత్రకు హైదరాబాద్ వేదికైంది. రూ. 70 వేల కోట్ల పెట్టుబడితో అతిపెద్ద ఏఐ డేటా సెంటర్‌ను హైదరాబాద్‌లోని ప్రతిష్ఠాత్మక ‘ఫ్యూచర్ సిటీ’లో నెలకొల్పేందుకు ప్రముఖ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) అనుబంధ సంస్థ ‘హైపర్‌వాల్ట్’ ముందుకు వచ్చింది.

టీసీఎస్ ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు
టీసీఎస్ ప్రతినిధులతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు

ఈ మెగా ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 7 వేల మంది నిపుణులకు ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఈ మేరకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు సమక్షంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, టీసీఎస్ ఉన్నతాధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు. కార్యక్రమంలో టీసీఎస్ సీఈవో కృతివాసన్, హైపర్‌వాల్ట్ ఇండియా సీఈవో దీపేశ్‌నంద, ఉపాధ్యక్షుడు రాజన్నతో పాటు మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పాల్గొన్నారు. అమెరికా నుంచి వర్చువల్ విధానంలో ఓపెన్ ఏఐ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ ఉదయ్ రుద్రరాజు హాజరయ్యారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *