Last Updated:
ఐపీఎల్ 2026లో ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 166, నమన్ ధిర్ 47, తిలక్ వర్మ 57, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బౌలర్లలో భువనేశ్వర్ 4 వికెట్లు తీసాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నేడు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ముంబై ఇండియన్స్ ఢీకొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 166 పరుగులు సాధించింది. ఓపెనర్లు రిక్కల్టన్ (2), రోహిత్ శర్మ (22) త్వరగా ఔటైనా.. నమన్ ధిర్ (47), తిలక్ వర్మ (57) రాణించడంతో ముంబై గౌరవప్రదమైన స్కోర్ చేయగలిగింది. భువనేశ్వర్ కుమార్ బౌలింగ్ దెబ్బకు ముంబై టాప్ ఆర్డర్ విలవిలలాడిపోయింది. సూర్యకుమార్ (0), విల్ జాక్స్ (10) చెత్త బ్యాటింగ్ చేశారు. దీంతో ముంబై భారీ స్కోర్ చేయలేకపోయింది. ఆర్సీబీ బౌలర్లలో భువనేశ్వర్ 4, హెజల్‌వుడ్, రసిక్ సలామ్, రొమారియో షెపర్డ్ చెరో వికెట్ పడగొట్టారు.
లేటెస్ట్ క్రికెట్ అప్‌డేట్స్, మ్యాచ్ అప్‌డేట్స్, మ్యాచ్ రివ్యూస్, లైవ్ స్కోర్, మ్యాచ్ అనాలిసిస్, ప్లేయర్ ప్రొఫైల్స్, ఇతర క్రీడలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు స్పోర్ట్స్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి
Hyderabad,Telangana













