Last Updated:
నరేశ్ అగస్త్య హీరోగా తెరకెక్కిన సినిమా ‘MRP’. నీకెంత నాకెంత అనేది ట్యాగ్ లైన్. పాంచజన్య ఫీచర్స్ బ్యానర్ పై శ్రవణ్ జేష్ఠ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సుదర్శన్, డోనాల్ బిస్తీ, కసిరెడ్డి కీలక పాత్రల్లో నటించారు.
నరేశ్ అగస్త్య హీరోగా తెరకెక్కిన సినిమా ‘MRP’. నీకెంత నాకెంత అనేది ట్యాగ్ లైన్. పాంచజన్య ఫీచర్స్ బ్యానర్ పై శ్రవణ్ జేష్ఠ దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. ఈ చిత్రంలో వెన్నెల కిశోర్, సుదర్శన్, డోనాల్ బిస్తీ, కసిరెడ్డి రాజ్ కుమార్, హర్ష వర్ధన్, చైతన్య జొన్నలగడ్డ, పృధ్వీ రాజ్, గగన్ విహారి, నంద గోపాల్, స్నేహ సింగ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. నేడు అనగా జూలై 17న (MRP Neekentha Naakentha) ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ మూవీ ఎంతమేర ప్రేక్షకులను మెప్పించింది? కథ, కథనాలు ఎలా ఉన్నాయి? అనేది ఇప్పుడు చూద్దాం..
మనోహర్ (నరేష్ అగస్త్య), దూళ్ల రవి (కసిరెడ్డి రాజ్ కుమార్), పరమేశ్వరరావు (సుదర్శన్) కాలేజీ రోజుల నుంచి ప్రాణ స్నేహితులు. హైదరాబాద్‌లో బ్యాచిలర్స్ గా ఉంటూ రకరకాల ఉద్యోగాలు చేస్తుంటారు. అయితే తమ వ్యాపారాన్ని ఎవరో కావాలని నాశనం చేశారని ఎస్ఐ శంకర్ (చైతన్య జొన్నలగడ్డ) వద్దకు వెళ్లి ఫిర్యాదు చేయడంతో అసలు కథ ప్రారంభమవుతుంది. మనోహర్‌కు వ్యాపారం చేసి కోట్లు సంపాదించాలనే కోరిక ఎక్కువగా ఉంటుంది. దానివల్ల తన ఉద్యోగాన్ని నిర్లక్ష్యం చేయడమే కాకుండా, ప్రియురాలు అమృత (డోనాల్ బిస్త్)తో బ్రేకప్ చేసుకుంటాడు. మరోవైపు ర్యాపిడో నడిపే పరమేశ్వరరావు కూడా తన పనిని కోల్పోతాడు. ఈ ఇద్దరూ కలిసి రవి ఉద్యోగం కూడా ఊడేలా చేస్తారు. ముగ్గురూ కలిసి బిజినెస్ మొదలుపెట్టాలని నిర్ణయించుకున్నా కుటుంబ సభ్యుల నుంచి ఆర్థిక సాయం అందదు. దీంతో మ్యాగ్నెట్ (వెన్నెల కిషోర్) ద్వారా దైవాజీ (నంద గోపాల్) అనే లోకల్ రౌడీ దగ్గర రూ. 50 లక్షలు అప్పుగా తీసుకుంటారు. దైవాజీకి తన కుటుంబం అంటే, ముఖ్యంగా తండ్రి, తమ్ముడు భాను (గగన్ విహారి) అంటే అస్సలు పడదు.
స్నేహితులు ముగ్గురూ పెట్టిన వ్యాపారం నష్టాలపాలవుతుంది. అప్పు తీర్చలేక దైవాజీ ఇంటికి వెళ్లిన సమయంలో, దైవాజీ తండ్రి గుండెపోటుతో కుప్పకూలిపోతాడు. వీళ్లు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఆయన ప్రాణాలు దక్కవు. కుటుంబ ఆస్తి గొడవల నేపథ్యంలో, అప్పుల నుంచి బయటపడటానికి దైవాజీ తండ్రి శవాన్ని కిడ్నాప్ చేయాలని ఈ ముగ్గురూ పథకం పన్నుతారు. కానీ ఆ ప్రయత్నంలో పొరపాటున మందాకిని అనే గుర్తుతెలియని మహిళ మృతదేహాన్ని ఎత్తుకొస్తారు. అసలు ఆ మందాకిని ఎవరు? దైవాజీ తండ్రి శవం ఏమైంది? ఈ కేసులో ఎంటర్ అయిన పోలీస్ ఆఫీసర్ (హర్షవర్ధన్) నుంచి వీరు ఎలా తప్పించుకున్నారు? చివరగా వీళ్లు అప్పు తీర్చారా లేదా అనేది మిగతా కథ.
ముగ్గురు స్నేహితుల పేర్లలోని మొదటి అక్షరాలను కలిపి ‘ఎం.ఆర్.పి’ (MRP) అని టైటిల్ గా పెట్టారు. రెగ్యులర్ క్రైమ్-కామెడీ ఫార్మాట్‌లోనే దర్శకుడు ఈ కథను నడిపించాడు. ఫస్టాఫ్ కాస్త నెమ్మదిగా సాగుతుంది. వెన్నెల కిషోర్ ఎంట్రీతో కథలో ఆసక్తి మొదలై.. శవాల మార్పిడి జరగడం, పోలీసుల ఎంట్రీతో సెకండాఫ్ పై ఇంట్రెస్ట్ పెరుగుతుంది.
ఇక సెకండాఫ్ లో ఆ శవం చుట్టూ జరిగే హైడ్ అండ్ సీక్ డ్రామా.. ముఖ్యంగా పోలీసులతో సుదర్శన్, రాజ్ కుమార్ చేసే కామెడీ ప్రేక్షకులను నవ్విస్తుంది. కానీ ఒకే పాయింట్‌ను ఎక్కువసేపు చూపించడం వల్ల కాస్త సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది కానీ, మందాకిని ఫ్లాష్ బ్యాక్, అలాగే చివర్లో వచ్చే క్లైమాక్స్ సీన్స్ డీసెంట్‌గా ఉన్నాయి.
నరేష్ అగస్త్య ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్
వెన్నెల కిషోర్, సుదర్శన్ కామెడీ ట్రాక్
బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
ఫస్టాఫ్
కొన్ని కామెడీ సీన్స్
మొత్తంగా చెప్పాలంటే.. స్టోరీలో కొత్తదనం లేకపోయినా క్రైమ్ కామెడీలను ఇష్టపడేవారు టైమ్ పాస్ కోసం ఈ చిత్రాన్ని హాయిగా చూడొచ్చు.
రేటింగ్: 2.75
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana














