వీటితో పాటు లడుకం (లడ్డు), మాషాపూపం (వడ), గుడప్పం (అప్పం), చక్రప్పం (దోశ) వంటి నాలుగు రకాల పణ్యారములను నివేదిస్తారు.
రెండో గంట అనంతరం మధ్యాహ్న నైవేద్యం లేదా రాజభోగాన్ని నిర్వహిస్తారు. ఈ సమయంలో శుద్ధాన్నం (తెల్ల అన్నం), పులిహోర, గుడాన్నం, దధ్యోదనం, శీరా లేదా శక్కరభాత్ వంటి ప్రసాదాలను సమర్పిస్తారు. మూడో గంట అనంతరం రాత్రి నైవేద్యంగా శయనభోగాన్ని నిర్వహించి, మరీచ్యాన్నం (మిరియాల అన్నం), చక్రప్పం (దోశ), లడుకం (లడ్డు), మాషాపూపం (వడ), శర్కరాన్నం తదితర ప్రసాదాలను స్వామివారికి నివేదిస్తారు.














