Tirumala Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఈ మట్టి కుండల రహస్యం ఏంటో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews

News18


Last Updated:

రేపటి నుంచే శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. ఈరోజు రాత్రి తిరుమలలో జరిగే అసలు ఘట్టం ఇదే!

News18
News18

అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, భక్త జన మందారుడు అయిన తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు సర్వ సిద్ధమైంది. అంగరంగ వైభవంగా జరిగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవాలు సెప్టెంబరు 15వ తేదీన అట్టహాసంగా ప్రారంభం కానున్నాయి. అయితే ఈ మహా క్రతువుకు ముందుగా సెప్టెంబరు 14వ తేదీ రాత్రి వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం అంకురార్పణ ఘట్టాన్ని అత్యంత శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలో పవిత్రంగా భావించే యాగశాలలో భక్తిశ్రద్ధలతో నిర్వహించే ఈ బీజవాపనంతో ఉత్సవాలకు లాంఛనంగా అంకురార్పణ జరుగుతుంది. సమస్త భూమండలమంతా సుభిక్షంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తూ వేద పండితులు ఉచ్ఛరించే మంత్ర ఘోషల నడుమ ఈ ఘట్టాన్ని జరిపిస్తారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *