Last Updated:
బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఆదేశాలతో సీబీఐ తాజాగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, దర్యాప్తును వేగవంతం చేసింది.
బాలీవుడ్ దివంగత యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మాజీ మేనేజర్ దిశా సాలియన్ అనుమానాస్పద మృతి కేసులో ఎట్టకేలకు ఒక సంచలన పరిణామం చోటుచేసుకుంది. బాంబే హైకోర్టు ఇచ్చిన కీలక ఆదేశాల మేరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) సోమవారం అధికారికంగా ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఏఎన్ఐ కథనం పేర్కొంది. 2020 జూన్ 8న ముంబైలోని మలాడ్ ప్రాంతంలో ఉన్న ఓ బహుళ అంతస్తుల భవనం పైనుంచి కిందపడి దిశా సాలియన్ ప్రాణాలు కోల్పోయింది. ఆ తర్వాత సరిగ్గా కొద్ది రోజులకే సుశాంత్ కూడా బాంద్రాలోని తన ఇంట్లో విగతజీవుడిగా కనిపించాడు.














