Last Updated:
పెట్టుబడుల పేరుతో లండన్ వెళ్లిన తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్, అక్కడ రేసింగ్ ఈవెంట్‌లో నటి త్రిషతో కలిసి కనిపించడం పెను దుమారం రేపింది. ఈ టూర్‌పై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నాలుగు రోజుల లండన్ పర్యటన ఆ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. రాష్ట్రానికి భారీ ఎత్తున విదేశీ పెట్టుబడులు తీసుకువచ్చే లక్ష్యంతో విజయ్ లండన్ వెళ్లినట్లు ప్రభుత్వం ప్రకటించింది. అయితే లండన్‌లోని ప్రఖ్యాత సిల్వర్‌స్టోన్ సర్క్యూట్‌లో సినీ నటుడు అజిత్ పాల్గొన్న రేసింగ్ ఈవెంట్‌లో విజయ్ ప్రత్యక్షమవ్వడం పెద్ద వివాదానికి దారితీసింది. ఆ ఈవెంట్‌లో ప్రముఖ నటి త్రిషతో కలిసి విజయ్ సందడి చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయ్యాయి.














