Last Updated:
PM Modi Sand Sculpture: మోదీ పుట్టిని రోజును పురస్కరించుకొని అంతర్జాతీయ ఇసుక శిల్ప కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ బీచ్‌లో 25 అడుగుల పొడవు, ఎత్తైన నరేంద్ర మోదీ ఇసుక శిల్పాన్ని రూపొందించారు.
PM Modi Sand Sculpture: భారతప్రధాని నరేంద్ర దామోదర్‌దాస్ మోదీ 75 ఏళ్లు పూర్తి చేసుకొని ఈరోజు 76వ ఏట అడుగుపెట్టారు.అంతే కాదు తన జీవితంలో పాతికేళ్లు ముఖ్యమంత్రిగా, ప్రధాన మంత్రిగా క్రియాశీల రాజకీయాల్లో ప్రభావశీల నేతగా, దేశభవిష్యత్తును మార్చే ఆలోచనలు చేసి భారత్‌ని వికసిత్ భారత్‌గా మార్చాలనే కంకణం కట్టుకున్నారు. అలాంటి పటిష్టమైన నాయకుడి పుట్టిని రోజును పురస్కరించుకొని అంతర్జాతీయ ఇసుక శిల్ప కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ ఒడిషాలోని పూరీ బీచ్‌లో 25 అడుగుల పొడవు, ఎత్తైన నరేంద్ర మోదీ ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతోంది. ఈ వీడియో, ఫోటోలు చూసి మోదీ అభిమానులు పట్నాయక్ నైపుణ్యాన్ని అభినందిస్తున్నారు.
భారతదేశ ప్రజలు విశ్వనాయకుడిగా పిలిచే ప్రధాని నరేంద్ర మోదీ బర్త్ డే సెలబ్రేషన్స్ దేశ వ్యాప్తంగా జరుగుతున్నాయి. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా అంతర్జాతీయ సైకత శిల్పి(ఇసుక శిల్పి) కళాకారుడు పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ పూరీ బీచ్‌లో 25 అడుగుల పొడవైన ఇసుక శిల్పాన్ని రూపొందించారు. ఈ కళాఖండంలో ప్రధాని మోదీ చిత్రం, త్రివర్ణ నేపథ్యం, “ఆశీర్వాద్ కా దియా – 25 ఏళ్ల సేవ – హ్యాపీ బర్త్‌డే మోదీ జీ” అనే సందేశం ఉన్నాయి.
ఈ శిల్పాన్ని వెలిగించడానికి మొత్తం 2,500 దీపాలను ఉపయోగించారు. ఇక్కడ 25 అడుగుల కళాఖండం 25 ఏళ్ల ప్రజా సేవను సూచిస్తుండగా, దీపాలు ప్రధాని పుట్టినరోజున ప్రజల ప్రార్థనలకు, శుభాకాంక్షలకు ప్రతీకగా నిలుస్తాయి. సెప్టెంబర్ 17 గురువారం సాయంత్రం 6 నుంచి 7 గంటల ప్రాంతంలో ఈ సైకతశిల్పం దగ్గర దీపాలు వెలిగించబోతున్నారు. ఆశీర్వాద దీపం పేరుతో నరేంద్ర మోదీకి ఆయురారోగ్యాలు, దీర్ఘాయిష్షు ప్రసాదించాలని కోరుతూ ఈ ఇసుక కళాఖండాన్ని రూపొందించారు సుదర్శన్ పట్నాయక్.
వస్తువులపై కాకుండా కేవలం ఇసుకతో అద్భుతమైన శిల్పాలను రూపొందించే కళాకారుడు , పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ 25 అడుగుల పొడవున్న మోదీ సైకత శిల్పాన్ని తయారు చేశారు. ఈ శిల్పాన్ని సుమారు 2,500 మట్టి దీపాలతో అత్యంత అందంగా అలంకరించారు.సుదర్శన్ పట్నాయక్ ఇప్పటికే కొన్ని వందల సైకత శిల్పాలను రూపొందించారు. ప్రకృతి విపత్తులు, భారతదేశ ఖ్యాతిని పెంచే సంఘటనలు జరిగినప్పుడు వెంటనే పూరీలోని బీచ్‌లో ఈ విధంగా అతిపెద్ద సైకత శిల్పాలను రూపొందిస్తుంటారు. కేవలం ప్రధాని మోదీ దేశానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయనపై అభిమానంతో ఈ సైకత శిల్పాన్ని రూపొందించానని శిల్పి సుదర్శన్ పట్నాయక్ తెలిపారు.













