Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్! | ACTPnews

Nara Lokesh | ఏయూలో చదవనందుకు బాధగా ఉంది..మంత్రి లోకేశ్ ఎమోషనల్ స్పీచ్!



విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) వందేళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించిన శతాబ్ది వేడుకల్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయూపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు. “ఏయూ చరిత్రలో ఇది సువర్ణ అధ్యాయం. వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ యూనివర్సిటీలో నేను చదవలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది” అని లోకేశ్ వ్యాఖ్యానించారు. 2014 విభజన తర్వాత ఏపీకి ఏయూ మరియు సీబీఎన్ అనేవి రెండు పెద్ద బ్రాండ్లని ఆయన పేర్కొన్నారు. నాడు ప్రభుత్వం ఏర్పడ్డాక తొలి కేబినెట్ భేటీని ఇక్కడే నిర్వహించామని గుర్తు చేశారు. వర్సిటీ అభివృద్ధికి ఎందరో మహానుభావులు, దాతలు చేసిన త్యాగాలను స్మరించుకున్నారు. ఏయూ రాష్ట్రానికే కాకుండా దేశానికే గర్వకారణమని కొనియాడారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports