Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్లారిటీ | ACTPnews

Pawan Kalyan Health Update: పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై ఎమ్మెల్యే విజయ్ కుమార్ క్లారిటీ



ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితిపై యలమంచిలి జనసేన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సోమవారం విశాఖలో మాట్లాడారు. పవన్ కళ్యాణ్కు మొదటి నుంచి కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నాయని, అయితే ప్రస్తుతం ఆయన క్షేమంగా ఉన్నారని తెలిపారు. గత ఐదేళ్లుగా విశ్రాంతి లేకుండా పోరాటం చేయడం, ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర పునర్నిర్మాణం కోసం నిరంతరం శ్రమించడం వల్ల ఒత్తిడి పెరిగిందని ఆయన పేర్కొన్నారు. శనివారం జరిగిన సర్జరీ తర్వాత పవన్ కోలుకుంటున్నారని, అభిమానులు ఆందోళన చెందాల్సిన పని లేదని స్పష్టం చేశారు. వైద్యుల సూచన మేరకు ఆయన మరో వారం రోజులు విశ్రాంతి తీసుకోనున్నారు. పవన్ త్వరగా కోలుకోవాలని ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబు సహా పలువురు ప్రముఖులు ఆకాంక్షించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports