Jailer 2 Movie: సెన్సార్ పూర్తి చేసుకున్న ‘జైలర్-2’ సినిమా.. రన్ టైమ్ ఎంతో తెలిస్తే షాక్ అవడం పక్కా! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

వచ్చే వారం రిలీజ్ కాబోతున్న జైలర్ 2 సినిమాపై ఒక్క తమిళ ఆడియెన్స్ మాత్రమే కాదు.. తెలుగు ఆడియెన్స్ కూడా తెగ వేయిట్ చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ ఊచకోత ఈ సారి ఊహకు కూడా అందదు అనే రేంజ్‌లో అంచనాలు పెట్టేసుకున్నారు.

News18
News18

వచ్చే వారం రిలీజ్ కాబోతున్న జైలర్ 2 సినిమాపై ఒక్క తమిళ ఆడియెన్స్ మాత్రమే కాదు.. తెలుగు ఆడియెన్స్ కూడా తెగ వేయిట్ చేస్తున్నారు. ముత్తువేల్ పాండియన్ ఊచకోత ఈ సారి ఊహకు కూడా అందదు అనే రేంజ్‌లో అంచనాలు పెట్టేసుకున్నారు. రీసెంట్‌గా రిలీజైన ట్రైలర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించకపోయినా.. ఫస్ట్ హాఫ్ ఊహించని రేంజ్‌లో హిట్టు కావడంతో దాని తాలూకు ఎక్స్‌పెక్టేషన్స్ మాత్రం అలానే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతీ అప్‌డేట్ మొత్తం సౌత్ ఇండస్ట్రీనే షేక్ చేస్తుంది.

కాగా.. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ పూర్తయింది. ఈ సినిమాను సెన్సార్ నుంచి ‘యూ/ఏ’ సర్టిఫికేట్ వచ్చింది. అంతేకాదు ఈ సినిమా రన్ టైమ్‌ కూడా లాక్ అయిపోయింది. ఈ సినిమా మొత్తం 165 నిమిషాల నిడివితో ప్రదర్శితం కానుంది. అంటే 2 గంటల 45 నిమిషాలు ముత్తువేల్ పాండియన్ ఊచకోత చూడబోతున్నాం అన్నమాట.

ఇక కొద్ది రోజులుగా ‘జైలర్ 2’లోని ఓ వైలెంట్ సీన్ విషయంలో రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ మధ్య చర్చ జరిగినట్లు ప్రచారం జరిగింది. సినిమాకు ‘యూ/ఏ’ సర్టిఫికెట్ రావాలనే ఉద్దేశంతో రజినీకాంత్ ఉండగా, సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని నెల్సన్ భావించినట్లు సమాచారం.

అయితే తాజాగా సెన్సార్ నుంచి ‘యూ/ఏ 16+’ సర్టిఫికెట్ రావడంతో ఈ విషయంలో రజినీకాంత్ అభిప్రాయానికే చివరికి ప్రాధాన్యం దక్కినట్లు తెలుస్తోంది. సినిమా కంటెంట్‌ను, వైలెంట్ సన్నివేశాలను పరిశీలించిన అనంతరం సెన్సార్ బోర్డు ‘యూ/ఏ 16+’ సర్టిఫికెట్ మంజూరు చేసింది. దీంతో ఈ అంశంపై జరుగుతున్న చర్చలకు కూడా తెరపడినట్లైంది.

‘జైలర్ 2’లో రజినీకాంత్‌తో పాటు భారీ తారాగణం నటిస్తోంది. విద్యా బాలన్, సూరజ్ వెంజారమూడు, మిర్నా, రమ్యకృష్ణ, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్‌తో వీరి పాత్రలపై ఆసక్తి పెరిగింది.

ఇక సీక్వెల్‌లో పలువురు స్టార్ హీరోలు ప్రత్యేక పాత్రల్లో కనిపించనుండటం సినిమాకు మరింత హైప్ తీసుకొచ్చింది. మోహన్‌లాల్, హృతిక్ రోషన్, శివరాజ్‌కుమార్, విజయ్ సేతుపతి వంటి ప్రముఖులు స్పెషల్ అప్పియరెన్స్‌లలో సందడి చేయనున్నారు. దీంతో ‘జైలర్ 2’ కేవలం రజినీకాంత్ సినిమా మాత్రమే కాకుండా భారీ మల్టీస్టార్ ప్రాజెక్ట్‌గా మారింది.

అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. మొదటి భాగాన్ని మించి యాక్షన్, కామెడీ, మాస్ ఎలిమెంట్స్‌తో దర్శకుడు నెల్సన్ సీక్వెల్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. 2 గంటల 45 నిమిషాల నిడివిలో ఇంతటి భారీ తారాగణాన్ని, కథను నెల్సన్ ఎలా నడిపించారనేది ఇప్పుడు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సెన్సార్ పూర్తి కావడంతో సినిమా విడుదలకు సంబంధించిన హైప్ మరింత పెరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports