Tamil Nadu: మైనర్ బాలిక అత్యాచారం కేసు.. రెండు ఉరిశిక్షలు విధించిన పోక్సో కోర్టు! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

తూత్తుకుడిలోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి పాల్పడిన 38 ఏళ్ల నిందితుడికి న్యాయస్థానం ‘డబుల్ డెత్ సెంటెన్స్’ (రెండు మరణశిక్షలు) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

Tamil Nadu: తమిళనాడులో మైనర్ బాలికపై జరిగిన దారుణ అత్యాచారం, హత్య కేసులో తూత్తుకుడిలోని ప్రత్యేక పోక్సో (POCSO) కోర్టు సోమవారం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ ఘోరానికి పాల్పడిన 38 ఏళ్ల నిందితుడికి న్యాయస్థానం ‘డబుల్ డెత్ సెంటెన్స్’ (రెండు మరణశిక్షలు) విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. తమిళనాడులోని విలాతికుళం ప్రాంతానికి చెందిన 17 ఏళ్ల మైనర్ బాలిక 2026 మార్చి నెలలో అకస్మాత్తుగా కనిపించకుండా పోయింది. దీనిపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కులత్తూరు పోలీసులు తొలుత మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే, ఆ తర్వాత జరిగిన దర్యాప్తులో ఆ బాలికపై అత్యాచారం చేసి దారుణంగా హత్య చేసినట్లు ఆధారాలు లభించడంతో.. ఈ కేసును భారతీయ న్యాయ సంహిత (BNS) మరియు పోక్సో (POCSO) చట్టంలోని కఠిన సెక్షన్ల కిందకు మార్చారు. ఈ కేసులో నిందితుడిని విలాతికుళంకు చెందిన ధర్మమునీశ్వరన్ అలియాస్ మావీరన్ (38) గా పోలీసులు గుర్తించారు.

క్లూ లేని కేసును ఛేదించిన పోలీసులు

ప్రారంభంలో ఈ కేసు దర్యాప్తు పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. నిందితుడి గురించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో, జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా 10 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు.

పోలీసులు ఆ ప్రాంతంలోని పలు సీసీటీవీ, ఫుటేజీలను నిశితంగా పరిశీలించగా.. అనుమానాస్పదంగా తిరిగిన ఒక ద్విచక్ర వాహనం ఆధారంగా నిందితుడు మావీరన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

అనంతరం నిర్వహించిన డీఎన్ఏ, పరీక్షల్లో బాలికపై అత్యాచారం మరియు హత్యకు పాల్పడింది మావీరనే అని శాస్త్రీయంగా నిరూపితమైంది.

కేవలం 54 రోజుల్లోనే ముగిసిన ట్రయల్

ఈ కేసులో పోలీసులు అత్యంత వేగంగా స్పందించారు. నిందితుడిని అరెస్ట్ చేసిన కేవలం 21 రోజుల్లోనే కోర్టులో పక్కా ఆధారాలతో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఆ తర్వాత పోక్సో ప్రత్యేక న్యాయస్థానంలో కేవలం 54 రోజుల్లోనే కోర్టు విచారణ, అంతా ముగిసింది.

నిందితుడు చేసిన నేరం సమాజం తలదించుకునేలా ఉందన్న ప్రాసిక్యూషన్ వాదనలతో ఏకీభవించిన న్యాయమూర్తి.. నిందితుడు ధర్మమునీశ్వరన్‌కు రెండు వేర్వేరు సెక్షన్ల కింద రెండు ఉరిశిక్షలు, విధిస్తూ తీర్పు చెప్పారు. ఇంత తక్కువ కాలంలో విచారణ పూర్తి చేసి బాధితురాలి కుటుంబానికి న్యాయం చేసిన పోలీసుల పనితీరుపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *