Last Updated:
ఆమె జీవితంతో ఆడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి, సదరు కానిస్టేబుల్‌ను మోసగించిన ఎస్సై సన్నెదాన సురేశ్‌ను కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
Hyderabad: సమాజంలో చట్టాన్ని కాపాడూతూ, మహిళలకు రక్షణగా నిలవాల్సిన ఒక బాధ్యతాయుతమైన సబ్ ఇన్స్పెక్టర్ (SI) దారి తప్పాడు. తన వద్దే పనిచేసే ఒక మహిళా కానిస్టేబుల్‌ను ప్రేమ పేరుతో లోబర్చుకుని, ఆమె జీవితంతో ఆడుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. పెళ్లై ఇద్దరు పిల్లలున్న విషయాన్ని దాచిపెట్టి, సదరు కానిస్టేబుల్‌ను మోసగించిన ఎస్సై సన్నెదాన సురేశ్‌ను కూకట్పల్లి పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు.
2018 బ్యాచ్‌కు చెందిన సన్నెదాన సురేశ్ (38) గతంలో కూకట్పల్లి పోలీస్ స్టేషన్లో ఎస్సైగా విధులు నిర్వర్తించాడు. 2020 నుంచి 2023 ఫిబ్రవరి వరకు ఆయన అక్కడ పనిచేశాడు. ఆ సమయంలో అదే ఠాణాలో రైటర్‌గా పనిచేస్తున్న ఒక మహిళా కానిస్టేబుల్‌తో సురేశ్‌కు పరిచయం ఏర్పడింది. తనకు అప్పటికే వివాహమై ఇద్దరు పిల్లలు ఉన్నారనే నిజాన్ని దాచి, ఆమెను ప్రేమ పేరుతో నమ్మించాడు. ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని లోబర్చుకున్నాడు.
వారిద్దరి మధ్య సంబంధం కొనసాగుతున్న క్రమంలో సదరు మహిళా కానిస్టేబుల్ గర్భం దాల్చింది. అయితే, ఆమెను పెళ్లి చేసుకునే ఉద్దేశం లేని సురేశ్, ఆమెకు బలవంతంగా గర్భస్రావం చేయించాడు. బాధితురాలు పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చిన ప్రతిసారి ఏదో ఒక సాకుతో దాటవేస్తూ వచ్చాడు. ఇటీవల సురేశ్ కొల్లూరు పోలీస్ స్టేషన్‌కు బదిలీ అవ్వగా, బాధితురాలు అక్కడికి వెళ్లి తనను పెళ్లి చేసుకోవాలని నిలదీసింది. దీనితో భయపడిన సురేశ్, అప్పటి నుంచి విధులకు రాకుండా తప్పించుకు తిరగడం ప్రారంభించాడు.
న్యాయం కోసం వేచి చూసిన బాధితురాలు చివరకు ఏప్రిల్ 1న కూకట్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయంపై విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు ప్రాథమిక ఆధారాలను బట్టి సురేశ్‌ను సైబరాబాద్ కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఆయనపై 45 రోజుల పాటు సస్పెన్షన్ వేటు వేశారు. పరారీలో ఉన్న సురేశ్ కోసం గాలించిన పోలీసులు, బుధవారం ఆయనను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. అనంతరం నిందితుడిని న్యాయస్థానంలో హాజరుపరిచారు.
రక్షక భటుడే భక్షకుడిగా మారి తోటి ఉద్యోగినిని మోసగించిన ఈ ఘటన పోలీస్ శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఎంతటి వారైనా చట్టానికి అతితీతులు కారని, తప్పు చేసిన వారు కచ్చితంగా శిక్ష అనుభవించాల్సిందేనని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
Hyderabad,Telangana













