Last Updated:
Revanth Reddy: కేసీఆర్, హరీష్ ను జైల్లో వేయాలని,ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి ఆనాడు అన్నారనికానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహించిందన్నారు.కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారు.కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది.
Revanth Reddy: కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని తెలిసి బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీష్ రావు ఢిల్లీకి పరిగెత్తాడని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరోపించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం కాలేశ్వరంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులతో కలిసి రూ.198 కోట్లతో చేపట్టిన కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయం పునరాభివృద్ధి పనులకు భూమి పూజ కార్యక్రమంతో పాటు కాలేశ్వరం బస్ స్టేషన్ కు శంకుస్థాపన చేశారు.ఆ తర్వాత కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి,శుభానందదేవి అమ్మవారిని మంత్రులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కాళేశ్వరం నుంచి మేడిగడ్డకు బయలుదేరారు. మేడిగడ్డ బ్యారేజిని సందర్శించి,బ్యారేజీ వద్ద పిల్లర్స్ 20,21,22 వద్ద బోర్ రింగ్స్ ద్వారా జియో టెక్నికల్, జియో ఫిజికల్,జిపిఆర్ శాంపిల్స్ సేకరణ పనులను పరిశీలించారు. దీనిపై ఉన్నత అధికారులతో సమీక్షించారు.
తెలంగాణను సస్యశ్యామలం చేయాలని 1975లో జలగం వెంగళ రావు ఆనాటి మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని అన్నారు.ఆ తర్వాత వైఎస్ హయాంలో 2009లో 38, 063 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారు.ప్రాణహిత చేవెళ్లకు 11,700 కోట్లు ఖర్చు చేశారు.ప్రాణహిత చేవేళ్లతో ఆర్ధిక, రాజకీయ ప్రయోజనం లేదని కెసీఆర్ రిడిజైనింగ్ పేరుతో పేరు, ఊరు అంచనాలు మార్చారు.
అంచనాలను 1 లక్షా 50 వేల కోట్లకు పెంచారు.2016లో మొదలు పెట్టిన మేడిగడ్డను 2019లో పూర్తిచేశామని ప్రారంభించారు.ఇది అద్భుతమని భ్రమలు కల్పించి 2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందారు. 2023లో మేడిగడ్డ కుప్పకూలింది.అన్నిటిని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పోందాలనుకున్నారు.దాచినా దాగని నిజాలను ప్రకృతి బయటపెట్టింది.ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023, నవంబర్ 1 న NDSA ప్రాథమిక రిపోర్ట్ కెసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చింది.ఆ నివేదికను కెసీఆర్ పట్టించుకోలేదు.ఈ దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చింది.దీనిపై మా రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తీర్మానం పంపిందన్నారు.
కేసీఆర్, హరీష్ ను జైల్లో వేయాలని,ఈ కేసును సీబీఐకి అప్పగించాలని కిషన్ రెడ్డి ఆనాడు అన్నారనికానీ కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్లక్ష్యం వహించిందన్నారు.కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారు.కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలని మా ప్రభుత్వం సంకల్పించింది. నెల రోజుల ముందే అధికారులతో, సాంకేతిక నిపుణులతో ఇవాళ సమావేశం పెట్టుకున్నాం అనినిజాలు భయట పడతాయని తెలిసి ఇవాళ కావాలని వాళ్లు పొలిటికల్ మీటింగ్ పెట్టుకున్నారని ఆరోపించారు.
కాళేశ్వరంపై విచారణకు ఆదేశిస్తారని తెలిసి బీజేపీ నేతల కాళ్లు పట్టుకునేందుకు హరీశ్ ఢిల్లీకి పరుగెత్తాడు.మీడియా బయటపెట్టినా వాళ్లు దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.బీజేపీని అడ్డు పెట్టుకుని అవినీతి కేసుల నుంచి బయటపడతామంటే రాష్ట్ర ప్రభుత్వం చూస్తూ ఊరుకొదు అని తేల్చి చెప్పారు.అవసరమైన ప్రణాళికలతో ముందుకు వెళతాం హరీశ్ తెలివి ఉండి మాట్లాడుతున్నాడో, తెలివి లేక మాట్లాడుతున్నాడో తెలియదు.శ్రీపాద ఎల్లంపల్లి ఈ ప్రాజెక్టుకు ప్రాణవాయువు హరీష్ నిక్కర్ తిరక్కముందే ఎల్లంపల్లి ప్రాజెక్టు ఉంది.ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంట పండించారు.
కాళేశ్వరం విచారణపై సిబిఐ ఎందుకు మౌనంగా ఉంది? మేం పదే పదే లేఖలు రాసినా ఎందుకు స్పందిచడం లేదు? హరీష్ రహస్య పర్యటన వెనక మతలబు ఏంటో తెలంగాణ ప్రజలకు చెప్పాలి.ఢిల్లీలో ఎవరెవరిని కలిశారో హరీష్ బయటపెట్టాలి.జడ్జిమెంట్ ప్రకటించకముందు వాదించడానికి వీలుండదు.మరి న్యాయవాదులను కలవడానికి వెళ్లాల్సిన అవసరం ఏముంది.కాళేశ్వరంలో దోషులను వదిలేది లేదు..దోషులను శిక్షించేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళతాం అని ప్రాజెక్టును కూడా ఊరికే వదలం అని రిపేర్లు చేసి నీరు అందిస్తాం అని సీఎం స్పష్టం చేశారు.
Warangal,Warangal,Telangana
Apr 21, 2026 11:14 AM IST












