Last Updated:
ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేని, నిష్పక్షపాతమైన సీబీఐ (CBI) దర్యాప్తు జరగాలనే డిమాండ్‌కు అత్యున్నత న్యాయస్థానం మద్దతు పలికింది. ఈ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా కోర్టులో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
Twisha Sharma: దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తున్న మాజీ నటి, మోడల్ ట్విషా శర్మ మృతి కేసును ఈ రోజు (సోమవారం) సుప్రీంకోర్టు విచారించింది. ఈ కేసులో ఎలాంటి పక్షపాతం లేని, నిష్పక్షపాతమైన సీబీఐ (CBI) దర్యాప్తు జరగాలనే డిమాండ్‌కు అత్యున్నత న్యాయస్థానం మద్దతు పలికింది. ఈ విచారణ సందర్భంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సాలిసిటర్ జనరల్ (SG) తుషార్ మెహతా కోర్టులో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కేసులో నిందితురాలిగా ఉన్న ట్విషా శర్మ అత్త గిరిబాల సింగ్.. మరణించిన ట్విషా ప్రతిష్టకు భంగం కలిగించేలా బహిరంగంగా దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన కోర్టు దృష్టికి తెచ్చారు.
ఈ క్రమంలో తుషార్ మెహతా ఒక కీలక వ్యాఖ్య చేశారు. “తల్లిదండ్రులకు.. శవమై ఇంటికి వచ్చే కూతురి కంటే, విడాకులు తీసుకుని బతికి ఉన్న కూతురే ఎంతో మేలు” అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కోర్టు హాల్‌లో అందరినీ కదిలించాయి. అంతేకాకుండా, ఈ కేసు దర్యాప్తును త్వరలోనే పూర్తిస్థాయిలో కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)కు అప్పగించే విషయమై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం తీసుకుంటుందని ఆయన కోర్టుకు హామీ ఇచ్చారు.
బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Telangana













