SARTHAK-PDS: కోట్ల మంది పేదలకు కేంద్రం భారీ శుభవార్త.. మరో ఐదేళ్లపాటూ..! | | ACTPnews

SARTHAK-PDS: కోట్ల మంది పేదలకు కేంద్రం భారీ శుభవార్త.. మరో ఐదేళ్లపాటూ..! |


ఈ పథకం జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA) 2013 అమలును మరింత బలోపేతం చేస్తుంది. ప్రస్తుతం సుమారు 81.35 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ఆహార ధాన్యాలు అందించే ప్రపంచంలోనే అతిపెద్ద ఆహార పంపిణీ నెట్‌వర్క్‌ భారత్‌లో ఉంది. తాజా నిర్ణయం దాన్ని మెరుగుపరుస్తుంది. అందువల్ల పేదలకు రేషన్ బియ్యం మరింత మెరుగ్గా లభిస్తాయి. కేంద్ర సమాచార & ప్రసార మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు బ్రీఫింగ్ ఇస్తూ ఈ వివరాలు వెల్లడించారు.

ఈ అంబ్రెల్లా స్కీమ్ రెండు అంశాలతో ఉంది. ఇది ఇప్పటికే ఉన్న పథకాలను ఏకీకృతం చేస్తుంది. (1) ఆహార ధాన్యాల అంతర్-రాష్ట్ర రవాణా & FPS డీలర్ల మార్జిన్‌కు సహాయం అందిస్తుంది. (2) SMART PDS ద్వారా టెక్నాలజీ ఆధారిత ఆధునికీకరణ జరుగుతుంది. తద్వారా పేదలకు రేషన్ బియ్యం, గోధుమల వంటివి స్మార్ట్ విధానంలో లభిస్తాయి. ఇప్పటికే ఏపీ లాంటి రాష్ట్రాలు స్మార్ట్ విధానాన్ని అమలు చేస్తున్నాయి. తాజా నిర్ణయంలో.. రాష్ట్రాల రవాణా భారాన్ని తగ్గించి, కేంద్రం ఆ భారాన్ని భరిస్తుంది. తద్వారా లబ్ధిదారులకు సకాలంలో, నాణ్యమైన ధాన్యం, గోధుమల వంటివి అందేలా చేస్తుందని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో తెలిపింది.

పథకం కింద అంచనా వేసిన ప్రయోజనాలు:

– రవాణా మార్గాలు 15-50% తగ్గించడం ద్వారా ఖర్చులు తగ్గుతాయి.

– AI, e-PoS పరికరాలు, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీల ద్వారా లీకేజీలు తగ్గించి, పారదర్శకత పెంచుతారు.

– FPS డీలర్లకు మెరుగైన మార్జిన్‌లు లభిస్తాయి. ఇది లాస్ట్ మైల్ డెలివరీని బలోపేతం చేస్తుంది.

– వలస కార్మికులకు పోర్టబుల్ రేషన్ సౌకర్యం మరింత సులభం అవుతుంది. ఏ రాష్ట్రంలో ఉన్నా వారు రేషన్ సరుకులు పొందగలరు. డీలర్ల దోపిడీకి బ్రేక్ పడుతుంది.

పీడీఎస్ డిజిటలైజేషన్ ఇప్పటికే గణనీయమైన పురోగతి సాధించింది. ఆధార్ లింకింగ్, e-PoS, ఇతర సాంకేతికతలు ద్వారా లీకేజీలు భారీగా తగ్గాయి. సార్థక్-పీడీఎస్ దీన్ని మరింత ముందుకు తీసుకెళ్తుంది.

ఈ సమావేశంలో PDSపైనే ఎక్కువగా దృష్టి పెట్టినప్పటికీ, కేంద్ర కేబినెట్ ఇతర రంగాల్లో కూడా నిర్ణయాలు తీసుకుంటోంది. ఇటీవలి సమావేశాల్లో మద్దతు ధర (MSP)ల పెంపు, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు, రైతు సంక్షేమం వంటివి ఆమోదం పొందాయి. అయితే మే 27 సమావేశంలో ప్రధాన దృష్టి SARTHAK-PDSపైనే దృష్టి పెట్టారు.

ప్రభావం, ప్రాముఖ్యం:

ఈ నిర్ణయం గ్రామీణ & పట్టణ పేదలకు ఆహార భద్రతకు హామీ ఇస్తుంది. పీఎం గరీబ్ కల్యాణ్ అన్న యోజన వంటి కార్యక్రమాలను బలపరుస్తుంది. రవాణా ఖర్చులు కేంద్రం భరించడం వల్ల రాష్ట్రాల ఆర్థిక భారం తగ్గి, సేవలు మెరుగుపడతాయి. పర్యావరణ ప్రయోజనాలుగా కార్బన్ ఉద్గారాలు తగ్గే ఛాన్స్ కూడా ఉంది.

ఈ పథకం.. NFSA అమలులో మైలురాయిగా టాక్ వినిపిస్తోంది. డిజిటల్ ఇండియా, పారదర్శకత, సమర్థమైన పంపిణీకి ఇది దోహదపడుతుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికే బలమైన PDS ఉన్నప్పటికీ, ఈ కేంద్ర సహాయం మరింత మెరుగైన అమలుకు ఉపయోగపడుతుంది.

మొత్తం మీద, ఈ నిర్ణయం మోదీ ప్రభుత్వ ‘గరీబ్ కల్యాణ్’ దృక్పథానికి అనుగుణంగా ఉంది. ఇది ఆహార భద్రత, రైతు సంక్షేమం, సాంకేతిక ఆధునికీకరణలను ఏకకాలంలో సాధించే దిశగా ముందడుగు వేస్తుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports