Viral Video: హైదరాబాద్‌లో షాపులో పట్టపగలే మహిళపై అఘాయిత్యం.. అరుపులు విని చితకబాదిన స్థానికులు | తెలంగాణ వార్తలు | ACTPnews

Hyderabad Crime News: మహిళ ఒంటరిగా ఉందని షాపులోకి దూరిన దొంగ.. మహిళ చేసిన పనికి అతనికే దిమ్మతిరిగింది!


Last Updated:

హైదరాబాద్‌లోని కొంపల్లి జయభేరి కాలనీలో చైన్ స్నాచింగ్ కలకలం రేపింది. ఆయిల్ షాపులో ఒంటరిగా ఉన్న మహిళపై దాడి చేసి బంగారు చైన్ లాగేందుకు యత్నించిన దుండగుడు.

Hyderabad Crime News: మహిళ ఒంటరిగా ఉందని షాపులోకి దూరిన దొంగ.. మహిళ చేసిన పనికి అతనికే దిమ్మతిరిగింది!
Hyderabad Crime News: మహిళ ఒంటరిగా ఉందని షాపులోకి దూరిన దొంగ.. మహిళ చేసిన పనికి అతనికే దిమ్మతిరిగింది!

పట్టపగలు.. జనం రద్దీగా ఉండే ప్రాంతం.. ఏకంగా ఓ దుకాణంలోకి చొరబడి మహిళపై దాడి చేసి మెడలోని బంగారాన్ని లాగేందుకు యత్నించిన ఓ దుర్మార్గుడు. ఆ మహిళ చూపిన ధైర్యంతో అడ్డంగా బుక్కయ్యాడు. హైదరాబాద్ నగర శివార్లలోని కొంపల్లి ప్రాంతంలో చోటుచేసుకున్న ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేసుకుని చెలరేగిపోతున్న చైన్ స్నాచర్లకు స్థానికులు దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన కొంపల్లి జయభేరి కాలనీలో ఈ సంచలన ఘటన వెలుగుచూసింది. కాలనీకి చెందిన ఓ మహిళ స్థానికంగా నూనెల దుకాణం (ఆయిల్ షాప్) నిర్వహిస్తూ జీవనం సాగిస్తోంది. రోజూలాగే ఆమె తన దుకాణంలో వ్యాపార పనుల్లో నిమగ్నమై ఉంది. అదే సమయంలో ఆమె ఒంటరిగా ఉండటాన్ని గమనించిన ఓ దుండగుడు పథకం ప్రకారం షాపులోకి కస్టమర్ లాగా ప్రవేశించాడు. చుట్టుపక్కల ఎవరూ లేరని నిర్ధారించుకున్న తర్వాత ఒక్కసారిగా తన కిరాతక బుద్ధిని బయటపెట్టాడు.

ఇది కూడా చదవండి: Thalliki Vandanam Money: తల్లికి వందనం రూ.15 వేలు డబ్బులు.. ఈ విషయం తెలుసా..

దుకాణంలో ఉన్న మహిళపై అమాంతం దాడికి దిగాడు. ఆమె తేరుకునే లోపే మెడలో ఉన్న బంగారు గొలుసును బలవంతంగా లాగేందుకు తీవ్రంగా ప్రయత్నించాడు. ఊహించని ఈ పరిణామానికి మొదట భయపడిన ఆ మహిళ, వెంటనే తన ప్రాణాలను పణంగా పెట్టి అతడిని తీవ్రంగా ప్రతిఘటించింది. “కాపాడండి.. దొంగ దొంగ..” అంటూ ప్రాణభయంతో పెద్దపెట్టున కేకలు వేసింది. ఆరుపులు విన్న చుట్టుపక్కల వారు అప్రమత్తమై వెంటనే నూనెల దుకాణం వైపు పరుగులు తీశారు.

ఇది కూడా చదవండి: Weather Update: దడ పుట్టిస్తున్న వాతావరణ శాఖ వార్నింగ్.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

స్థానికులు పెద్ద సంఖ్యలో గుమిగూడటంతో చైన్ స్నాచర్ అక్కడి నుంచి పారిపోయేందుకు విఫలయత్నం చేశాడు. కానీ, యువకులు, కాలనీవాసులు అతడిని చుట్టుముట్టి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మహిళపై దాడికి దిగిన ఆ దుర్మార్గుడికి స్థానికులంతా కలిసి దేహశుద్ధి చేశారు. బడితెపూజ చేసి దొంగకు బుద్ధి చెప్పారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు.

ఈ దొంగతనానికి సంబంధించిన దృశ్యాలన్నీ దుకాణంలో అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. పోలీసులు ఆ సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. పట్టుబడిన నిందితుడు పాత నేరస్థుడా, లేక ఏమైనా మత్తులో ఈ దారుణానికి ఒడిగట్టాడా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. ఒంటరిగా దుకాణాలు నిర్వహించే మహిళలు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడంతో పాటు, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే డయల్ 100 కి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *