Tamil Nadu Politics: తమిళనాడు క్యాబినెట్‌లోకి కాంగ్రెస్.. 59 ఏళ్ల తర్వాత ప్రభుత్వంలో భాగస్వామ్యం ! | | ACTPnews

News18


Last Updated:

తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త అధ్యాయం మొదలైంది. సుదీర్ఘ కాలం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి కానుంది. ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని క్యాబినెట్‌లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

News18
News18

తమిళనాడు రాజకీయాల్లో ఒక చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. సుమారు 59 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ అక్కడ అధికారంలో భాగస్వామ్యం పంచుకోబోతోంది. నటుడు, రాజకీయ నాయకుడు జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK) నూతన ప్రభుత్వంలో చేరడానికి కాంగ్రెస్ అధిష్ఠానం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అడ్వకేట్ రాజేశ్ కుమార్, పి. విశ్వనాథన్ విజయ్ క్యాబినెట్‌లో మంత్రులుగా బాధ్యతలు స్వీకరిస్తారని పార్టీ సీనియర్ నేత కేసీ వేణుగోపాల్ అధికారికంగా ప్రకటించారు. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో టీవీకే (TVK) అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీకి కొద్దిగా దూరంలో నిలిచింది. దీంతో ఐదుగురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ విజయ్‌కు పూర్తి మద్దతు ప్రకటించింది. 1967 తర్వాత కాంగ్రెస్ తమిళనాడు ప్రభుత్వంలో చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం.

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీలతో జరిగిన సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రభుత్వాన్ని ప్రజా సంక్షేమం కోసం ఉపయోగించుకోవాలని అధిష్ఠానం తమ ఎమ్మెల్యేలకు సూచించింది.

ఈ ఎన్నికల్లో డీఎంకే (DMK), అన్నాడీఎంకే (AIADMK) సంప్రదాయ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సరికొత్త రికార్డు సృష్టించారు. కాంగ్రెస్‌తో పాటు వామపక్షాలు, వీసీకే (VCK) పార్టీలు కూడా విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు తమ మద్దతును అందించాయి.

వామపక్షాలు కేవలం వెలుపల నుంచే మద్దతు ఇస్తామని ప్రకటించగా, కాంగ్రెస్ మాత్రం నేరుగా క్యాబినెట్‌లో చేరాలని నిర్ణయించుకుంది. ఈ కొత్త కూటమి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కలిసి పోటీ చేసే అవకాశం ఉంది.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports