ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ వివాదాస్పద వ్యాఖ్యలు.. క్షమాపణ చెప్పాలంటూ బీజేపీ డిమాండ్ ! | | ACTPnews

News18


Last Updated:

ప్రధాని మోదీపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తీవ్రంగా ఖండించింది. రాయ్‌బరేలీలో ఆయన మాట్లాడిన మాటలు అరాచక ఆలోచనలకు అద్దం పడుతున్నాయని, వెంటనే దేశ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.

News18
News18

ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశించి లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన ‘గద్దార్’ (ద్రోహి) వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో తీవ్ర కలకలం రేపాయి. రాయ్‌బరేలీలో నిర్వహించిన ఓ సభలో రాహుల్ గాంధీ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీనిపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. రాహుల్ గాంధీ వెంటనే ప్రధాని మోదీకి, దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. బీజేపీ నూతన అధ్యక్షుడు నితిన్ నబిన్ నేతృత్వంలో కేంద్ర మంత్రులు, సీనియర్ నాయకులు రాహుల్ వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. వరుస ఎన్నికల ఓటములతో వచ్చిన నైరాశ్యం, నిరాశ వల్లనే రాహుల్ గాంధీ ఇలాంటి అసభ్యకర భాషను వాడుతున్నారని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు ఆయనకున్న విభజన మానసిక స్థితిని, అరాచక ఆలోచనలను స్పష్టం చేస్తున్నాయని మండిపడ్డారు. భారత రాజకీయాల్లో పరస్పర గౌరవానికి ప్రాధాన్యత ఉంటుందని, ప్రధాని పదవిని అవమానించడం అంటే దేశంలోని 140 కోట్ల మంది ప్రజలను అవమానించడమేనని బీజేపీ స్పష్టం చేసింది.

కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ స్పందిస్తూ మోదీ నాయకత్వంలో భారతదేశం ప్రపంచస్థాయిలో సాధిస్తున్న అభివృద్ధిని రాహుల్ గాంధీ జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తోందని ఆరోపించారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సైతం రాహుల్ గాంధీపై తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్ ‘యువరాజు’ చేస్తున్న ఇటువంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు ఆయనకున్న ప్రతికూల రాజకీయ ఆలోచనలను, ప్రజాస్వామ్య విలువల పట్ల ఉన్న అగౌరవాన్ని తెలియజేస్తున్నాయని పేర్కొన్నారు.

పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు మాట్లాడుతూ రాహుల్ గాంధీ అనుసరిస్తున్న ప్రతికూల రాజకీయాల వల్ల తటస్థ ఓటర్లు సైతం కాంగ్రెస్ పార్టీకి పూర్తిగా దూరమవుతున్నారని విశ్లేషించారు. ప్రధానిని ఎంతగా విమర్శిస్తే ప్రజలు అంతగా ఆయనను గెలిపిస్తారని గుర్తుచేశారు.

Click here to add News18 as your preferred news source on Google.

బ్రేకింగ్ న్యూస్, రాజకీయాలు, దేశంలోని అన్ని రాష్ట్రాల్లోని ముఖ్యమైన వార్తలు, విశ్లేషణ, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన స్టోరీలను న్యూస్18 తెలుగు నేషనల్ కేటగిరీలో చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *