Last Updated:
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్‌కు ఊహించని షాక్ తగిలింది. సోమవారం (జూన్ 23) వ్యక్తి గతంగా కోర్ట్ ముందు విచారణ కు హాజరు కావాలని నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది.
సోమవారం వ్యక్తి గతంగా కోర్ట్ ముందు విచారణ కు హాజరు కావాలని సినీ నటుడు అల్లు అర్జున్ కు సమన్లు జారీ చేసింది. గతంలో సంధ్య థియేటర్ కేసులో అల్లు అర్జున్ ను A11 నిందితుడిగా చేర్చారు చిక్కడపల్లి పోలీసులు. A1 నుండి A10 వరకు నిందితులుగా సంధ్య థియేటర్ యాజమాన్యం ఉంది. ఈ నేపథ్యంలో సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో 19 మంది నిందితులకు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. ఇప్పటికే 23 మందిని నిందితులుగా చేర్చి పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు.
2024 డిసెంబర్ 4న పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిన సంగతి తెలిసిందే. ఈ తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు శ్రీతేజకు తీవ్రగాయాలు అయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టి విచారణ కొనసాగిస్తున్నారు చిక్కడపల్లి పోలీసులు. ప్రాథమికంగా అనుమతులు లేవని హెచ్చరించినప్పటికీ శాంతిభద్రతల సమస్యలను లెక్కచేయకుండా అల్లు అర్జున్ సంధ్య థియేటర్‌కు రావడం, ఓపెన్ టాప్ జీపులో అభిమానులకు అభివాదం చేయడం వల్లనే రద్దీ పెరిగిందని, ఆ కారణంగానే తొక్కిసలాట జరిగిందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ క్రమంలోనే అల్లు అర్జున్‌తో పాటు థియేటర్ యాజమాన్యం, బౌన్సర్లు సహా మొత్తం 23 మందిపై పోలీసులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు.
సినిమా న్యూస్, మూవీ అప్‌డేట్స్, సినిమా రివ్యూస్, OTT అప్‌డేట్స్, టీవీ షోస్, రియాల్టీ షోస్, వెబ్‌స్టోరీస్ ఈ కేటగిరీలో చూడొచ్చు. న్యూస్ 18 తెలుగులో లేటెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అప్‌డేట్స్ చదవండి. మరిన్ని వార్తల కోసం న్యూస్ 18 తెలుగు ఫాలో అవండి.
Hyderabad,Hyderabad,Telangana













